Political News

‘పిక్చర్ బాకీ హే..’ బీఆర్ఎస్ కు కవిత వార్నింగ్!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో బీఆర్ఎస్ కు వచ్చిన స్థానాల నేపథ్యంలో ఆ పార్టీకి జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కు కవిత డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. జాగృతిపై బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో ఇంకో చోట ట్రోలింగ్, కామెంట్స్ చేస్తున్నారని…‘కారు’కూతలు కూస్తున్నారని మండిపడ్డారు.

‘‘ఏ సిర్ఫ్ ట్రైలర్.. పిక్చర్ బాకీ హై’’ అంటూ మాస్ డైలాగ్ తో బీఆర్ఎస్ కు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడే తొందరపడి మాట జారకండి, కారు కూతలు కూయకండి అని హితవు పలికారు. ఇప్పటికైనా తప్పులను బీఆర్ఎస్ సరిదిద్దుకోవాలని..ఉద్యమ కారులను పట్టించుకోవాలని సూచించారు.

అలా కాకుండా ఉద్యమకారుల తరపున మాట్టాడి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టిన తనను బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారని, ఆ పొగరు తగ్గించుకోవాలని, ప్రజల మద్యలో ఉండాలని హితవు పలికారు. కాంగ్రెస్ తప్పులను ఎండగట్టడంలో బీఆర్ఎస్ విఫలమైందని, అందుకే కాంగ్రెస్ కు మెరుగైన ఫలితాలు వచ్చాయిని..ప్రజలు వేరే ప్రత్యామ్నాయం లేక కాంగ్రెస్ కు ఓటేశారని చెప్పారు.

జాగృతి ఇంకా రాజకీయ పార్టీగా పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో జాగృతి ప్రత్యామ్నాయం అనే రీతిలో పరోక్షంగా కవిత చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి.

కరీంనగర్ కార్పొరేషన్‌లో తప్ప బీజేపీ అసలు ఎక్కడా అడ్రస్ లేదన్నారు. వడ్డేపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రలోభాలకు గురిచేస్తోందని ఆరోపించారు. ఎవరికి మద్దతివ్వాలో స్థానిక జాగృతి నేతలు డిసైడ్ చేసుకుంటారని తెలిపారు. సింగరేణి ఎన్నికల్లోనూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ (ఏఐఎఫ్‌బీ‌)తో కలిసి జాగృతి పోటీ చేస్తుందని కవిత ప్రకటించారు. 40కి పైగా స్థానాల్లో జాగృతి, ఏఐఎఫ్‌బీ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

అయితే, తమ గెలుపుతో కవితకు సంబంధం లేదని వడ్డేపల్లి మున్సిపాలిటీ గెలుచుకున్న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ప్రకటించడం కవితకు షాక్ ఇచ్చినట్లయింది. కవిత తమకు జాగృతి కండువా కప్పారని, కానీ ప్రచారానికి రాలేదని, ప్రచారంలో తాము కవిత కండువా కూడా వేసుకోలేదని చెప్పారు. వాస్తవానికి, మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి ప్రభావం పెద్దగా ఏమీ లేదు. ఓట్ షేర్ ప్రకారం చూసుకున్న కాంగ్రెస్ పార్టీకి 41 శాతం..బీఆర్ఎస్ కు 32 శాతం..బిజెపికి 14% ఓట్లు వచ్చాయి. 15 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఈ ఫలితాలు వచ్చాయి.

అటువంటిది, ఇంకా రాజకీయ పార్టీ పెట్టని జాగృతి….భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం అవుతుందన్న అర్థం వచ్చేలా కవిత మాట్లాడడం విశేషం. అయితే, తాము ఇంకా రాజకీయ పార్టీగా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగలేదని కవిత చెప్పారు. కాబట్టి, భవిష్యత్తులో బలమైన పార్టీగా ఎదిగి కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం అవుతారా లేదా అన్న ప్రశ్నకు కాలమే సమాధనమిస్తుంది.

This post was last modified on February 14, 2026 5:35 pm

Share

Recent Posts

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

28 minutes ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

51 minutes ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

3 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

3 hours ago

టీడీపీకి 58 కోట్లు.. వైసీపీకి 24 కోట్లు.. బీఆర్ ఎస్‌కు 16 కోట్లు..

భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…

4 hours ago

కార్తీ రేంజు ఇంత పడిపోయిందా

యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…

6 hours ago