పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా బెల్దంగా కేంద్రంగా మరోసారి బాబ్రీ అంశం రాజకీయ చర్చలకు దారితీసింది. జనతా ఉన్నాయన్ పార్టీ అధ్యక్షుడు హుమాయున్ కబీర్ బుధవారం ఖురాన్ పఠనం అనంతరం మసీదు నిర్మాణ పనులను ప్రారంభించినట్టు ప్రకటించారు.
అయోధ్యలో కూల్చివేయబడిన నిర్మాణ నమూనాను ఆదర్శంగా తీసుకుని మసీదు నిర్మిస్తామని, రెండేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. “అల్లాహ్ కృపతో మా బాబ్రీ మసీదు నిర్మాణం పూర్తి అవుతుంది” అని ఆయన వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
మాజీ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కబీర్ ఇటీవలే కొత్త పార్టీ స్థాపించి ఈ ప్రకటన చేయడం విశేషంగా మారింది. ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ ఈ నిర్ణయం రాజకీయ వ్యూహంలో భాగమేనా? ముఖ్యంగా ముస్లిం ఓటు బ్యాంకుపై ప్రభావం చూపే ప్రయత్నమా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు ఇది దారి తీస్తుందా అన్నదీ ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉండగా, బాబ్రీ మసీదు అంశం ముగిసిన అధ్యాయమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. మసీదును మళ్లీ నిర్మిస్తామనే కలలు నెరవేరవని వ్యాఖ్యానించారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణం అనంతరం దేశంలో శాంతి, సామరస్యాలు కాపాడాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ పరిణామాలతో బాబ్రీ అంశం మరోసారి జాతీయ రాజకీయాల్లో వేడి చర్చలకు దారి తీసింది.
This post was last modified on February 12, 2026 9:49 am
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…