Political News

నెలలో 6,433 సుపథం టికెట్లు జారీ… వైవీ పీఏ పనే?

కల్తీ నెయ్యి సరఫరా కేసులో నిందితుడిగా ఉన్న కదురు చిన్నప్పన్న తనకు 2018 వరకు మాత్రమే పీఏగా పనిచేశాడని, ఆ తర్వాత అతనితో ఎలాంటి సంబంధం లేదని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెబుతున్న నేపథ్యంలో కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి.

సాధారణ భక్తులు శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం ఉచిత దర్శన టోకెన్లకు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోంది. రూ.300 సుపథం టికెట్లు ఆన్లైన్ ద్వారా లేదా ప్రజాప్రతినిధుల సిఫారసుతో దొరికితే అదృష్టంగా భావించే పరిస్థితి ఉంది.

అలాంటి సమయంలో 2021 సెప్టెంబరు నెలలో మాత్రమే చిన్నప్పన్న పేరు మీద టీటీడీ ఛైర్మన్ కార్యాలయం నుంచి 6,433 సుపథం టికెట్లు జారీ అయినట్లు సమాచారం. అంటే రోజుకు సగటున 214 టికెట్లు జారీ అయినట్టుగా లెక్కలు చూపిస్తున్నాయి. ఈ వ్యవహారం రోజూ నిరవధికంగా కొనసాగినట్లు తెలుస్తోంది.

వైసీపీ హయాంలో ఒక్కో ఎమ్మెల్యేకి రోజుకు ఆరు సుపథం టికెట్లు మాత్రమే, అది కూడా వారానికి ఐదు రోజులపాటు మాత్రమే ఇచ్చే పరిమితి ఉండేదని అధికారులు చెబుతున్నారు.

అలాంటిది ఒక వ్యక్తి పేరు మీదే నెలలో వేల సంఖ్యలో టికెట్లు జారీ కావడం అనుమానాలకు తావిస్తోంది. ఈ లెక్కన సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న నాలుగేళ్ల కాలంలో చిన్నప్పన్న పేరు మీద ఎన్ని టికెట్లు జారీ అయ్యాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. వీఐపీ బ్రేక్ దర్శనం, ఆర్జితసేవల టికెట్ల జారీపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.

సుబ్బారెడ్డి మాత్రం చిన్నప్పన్న 2014–2018 మధ్యే తన వద్ద పీఏగా పనిచేశాడని, తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన్‌లో లైజన్ అధికారిగా పనిచేశాడని, తనతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటున్నారు.

అయితే ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగి పేరు మీదే ఛైర్మన్ కార్యాలయం నుంచి వేల టికెట్లు జారీ కావడంపై ఆశ్చర్యం కలిగించే అంశం. టీటీడీతో అధికారిక సంబంధం లేని వ్యక్తి పేరు మీద ఈ స్థాయిలో టికెట్లు ఎలా జారీ అయ్యాయి? ఆ అనుమతులకు ఆధారం ఏమిటి? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రధానంగా మారాయి.

This post was last modified on February 12, 2026 2:54 pm

Share

Recent Posts

పవన్ కళ్యాణ్ – ఒక జన సేవకుడి ప్రస్థానం

సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…

33 minutes ago

తమిళనాడులో అప్పుడే పెడాకులా…

మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…

37 minutes ago

స్థానిక ఎన్నికలకు SIR చిక్కుముడి?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…

58 minutes ago

జనసేన ఎమ్మెల్యేపై చంద్రబాబు అసంతృప్తి

కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…

3 hours ago

ఏపీలో పెరిగిపోతున్న బీపీ… ఆ జిల్లాలో మరీ ఎక్కువ!

ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…

4 hours ago

సినిమా షూటింగ్… ఐదుసార్లు చావుకు దగ్గరగా

సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…

9 hours ago