Political News

లడ్డూ వివాదాన్ని కోర్టుకు వదిలేస్తేనే బెటరా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని వినియోగించిన వ్యవహారం రాజకీయంగా రచ్చ రేపిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు చార్జిషీట్‌ను కూడా దాఖలు చేశారు. ప్రస్తుతం ఇది నెల్లూరు ఏసీబీ కోర్టు పరిధిలో ఉంది. అయినప్పటికీ నివేదిక వెలుగు చూడడంతో రాజకీయంగా వైసీపీ వర్సెస్ కూటమి పార్టీల మధ్య ఈ వ్యవహారం రాజకీయ రచ్చకు దారితీసింది.

అయితే దీనిని పొడిగించడం ఆపేయాలని, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి మేలు చేసేలా గత 19 మాసాల్లో చేసిన పనులను సభా వేదికగా ప్రస్తావించాలని సీఎం స్థాయిలో నిర్ణయించారు. ఇప్పటి వరకు జరిగినది ఎలా ఉన్నా ఇక నుంచి మాత్రం లడ్డూ వ్యవహారంపై నెల్లూరు కోర్టు సహా సుప్రీంకోర్టు తేల్చే వరకు మౌనంగా ఉండాలని పార్టీ నాయకులకు, శ్రేణులకు కూడా సమాచారం చేరవేశారు.

ఇలా లడ్డూ వ్యవహారంపై మౌనంగా ఉండడానికి రెండు కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది.

టీడీపీ, జనసేన కంటే కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. దీనిని దీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నా ఒకింత అధికార పక్షం వెనుకబడిందన్న చర్చ ఉంది. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని ఇప్పటితో వదిలేయడంతో పాటు, ఎలానూ ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన దరిమిలా కోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

పదేపదే ఈ వ్యవహారాన్ని ప్రజల మధ్యకు తీసుకువెళ్లినా అనుకున్నంత ప్రచారం రాలేదు. చర్చ కూడా జరగడం లేదు. ధార్మిక సంఘాలు స్పందించినా మొక్కుబడిగానే ముందుకు సాగారు. ఈ నేపథ్యంలో లడ్డూ వ్యవహారాన్ని ఇక తెగేదాకా లాగరాదని నాయకులు నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న చంద్రబాబు ఇక నుంచి ఎవరూ మాట్లాడవద్దని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు.

This post was last modified on February 11, 2026 5:22 pm

Share

Recent Posts

సరైన పుకారు ఎవరు సృష్టించారు

సరైనోడు ఇచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శీను కాంబోలో ఒక సినిమా తెరకెక్కే అవకాశముందంటూ నిన్న…

10 minutes ago

రాకాతో ఆస్కార్ కొట్టి త‌మిళంలో మాట్లాడ‌తా

ఒక‌ప్పుడు ఆస్కార్ అవార్డుల గురించి ఇండియ‌న్ ఫిలిం మేక‌ర్స్ ఆలోచించ‌డం కూడా క‌ష్టంగా ఉండేది. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా త‌ర్వాత…

3 hours ago

టీనేజ్ ప్రేమలు కాసులు కురిపిస్తాయా

మొన్న గాంధీ జయంతికి విడుదలైన సినిమాల్లో బడ్జెట్ తక్కువే అయినా తెల్లకాగితం అంతో ఇంతో సౌండ్ చేయడంలో సక్సెసయ్యింది. వీడియోలు…

4 hours ago

మంట‌లు రేపుతున్న `ఫాం-6..`

కొత్త‌గా ఓటు న‌మోదు చేసుకోవాల‌ని అనుకునేవారు.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం వెబ్ సైట్ లేదా..అధికారుల నుంచి ఫాం-6ను తీసుకుని దానిని…

4 hours ago

అఖండ-3 నిజంగా సాధ్యమేనా?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్య చాలా ఏళ్ల…

8 hours ago

మరో విమానంలో సీరియస్ సిగ్నల్స్

విమానాలు భయపెడుతున్నాయి. గత వారం ఫ్లై దుబాయ్ విమానాన్ని కూల్చివేసేందుకు కో పైలట్ ప్రయత్నం చేయడం ప్రపంచ వ్యాప్తంగా వార్తయ్యింది.…

10 hours ago