Political News

వైసీపీ మతాన్ని వాడుకుంటుందా? పవన్ ఏమన్నారు?

వైసీపీ నేత‌లు, ఆ పార్టీ వ్య‌వ‌హారంపై డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌ధానంగా రెండు విష‌యాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలో వైసీపీ స‌భ్యులు రాజ‌కీయ నినాదాలు చేయ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు. అంతేకాదు.. స‌భ‌లో అల‌జ‌డి సృష్టించేందుకు ప్ర‌యత్నించార‌ని కూడా వ్యాఖ్యానించారు. ఈ విష‌యాన్ని స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు సీరియ‌స్‌గా తీసుకోవాల న్నారు.

ఇక‌, మ‌తాన్ని సైతం.. రాజ‌కీయంగా వాడుకునేందుకు వైసీపీ కుట్ర‌లు చేస్తోంద‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. ఈ విష‌యంలో ఎంత‌కైనా తెగించేందుకు సాహ‌సిస్తార‌ని చెప్పిన ప‌వ‌న్‌.. అధికార కూట‌మి పార్టీలు, ఆయా పార్టీల నాయ‌కులు కూడా అత్యంత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. బుధ‌వారం ప్రారంభ‌మైన అసెంబ్లీ స‌మావేశాల్లో తొలిరోజు గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ ప్ర‌సంగించారు. అనంత‌రం.. స‌భ‌ను వాయిదా వేశారు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సీఎం చంద్ర‌బాబు స‌హా భేటీ అయ్యారు.

స‌భ‌లో వ్య‌వ‌హ‌రించాల్సిన విధానం.. ఏయే అంశాల‌ను లేవ‌నెత్తాలి?  అనే విష‌యాల‌పై సీఎం చంద్ర‌బాబు చ‌ర్చించారు. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో ర‌చ్చ చేసేందుకు వైసీపీ వ్యూహాత్మ‌కంగా ఎదురు దాడి చేసే అవ‌కాశం ఉంద‌న్నారు.

ముఖ్యంగా తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదాన్ని అప‌విత్రం చేసింది కాక‌.. దీనిని త‌మ రాజ‌కీయాల‌కు అనుగుణంగా వినియోగించుకునే అవ‌కాశం ఉందని ప‌వ‌న్ హెచ్చ‌రించారు. ఈ క్ర‌మంలో కూట‌మి పార్టీల మ‌ధ్య స‌ఖ్య‌త ముఖ్య‌మని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఏ విష‌యంలో అయినా.. క‌ల‌సి క‌ట్టుగా ఎదుర్కొనేందుకు.. రాజ‌కీయంగా ఉమ్మ‌డిగా నిల‌బ‌డేందుకు సిద్ధంగా ఉండాల‌ని ఆయ‌న సూచించారు.

This post was last modified on February 11, 2026 6:17 pm

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

8 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

8 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

9 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

9 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

11 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

12 hours ago