Political News

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక కార్య‌క‌ర్త‌.. జ‌గ‌న్ కాన్వాయ్ కింద ప‌డి మృతి చెందార‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఆ నాటి ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రుగుతోంది. తాజాగా విజ‌య‌వాడ శివారులోని ఇబ్ర‌హీంప‌ట్న‌లోని మాజీ మంత్రి, వైసీపీ నాయ‌కుడు జోగి ర‌మేష్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు జ‌గ‌న్ వెళ్లారు.

ఈ క్ర‌మంలో ఇద్ద‌రు కార్య‌క‌ర్త‌లు మృతి చెందారు., జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లో పాల్గొనేందుకు ఎన్టీఆర్ జిల్లా చిల్ల‌క్ల‌లు గ్రామానికి చెందిన పంచాయ‌తీ ప్రెసిడెంట్ రాంబాబు కూడా బ‌య‌లు దేశారు. ఈయ‌న ద్విచ‌క్ర వాహ‌నంపై వ‌స్తుండ‌గా.. షుగ‌ర్ లెవిల్స్ ప‌డిపోయి.. ఒక్క‌సారిగా కుప్ప‌కూలారు. దీంతో స్పందించిన కార్యకర్తలు.. ఆయ‌న‌ను స‌మీపంలోని హాస్పిట‌ల్‌కు త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేయ‌గా.. అప్ప‌టికే ఆయ‌న మృతి చెందిన‌ట్టు వైద్యులు తెలిపారు.

మ‌రో ఘ‌ట‌న‌లో..

జ‌గ‌న్ వ‌స్తున్నాడ‌న్న ఆనందంతో.. కార్య‌క‌ర్త‌లు కొంద‌రు రోడ్ల‌పై బైకుల‌తో స్టంట్లు చేశారు. ఈ క్ర‌మంలో ఓ కార్య‌క‌ర్త చేస్తున్న స్టంట్ అదుపు త‌ప్పి.. బైకు వెళ్లి రోడ్డుపై ఉన్న బార్ గేట్‌ను బ‌లంగా డీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో  కార్య‌క‌ర్త త‌ల‌కు బ‌ల‌మైన గాయ‌మై.. అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు.

ఇత‌ను ఇబ్రహీంపట్నం కొత్తగేట్‌కు చెందిన భార్గవ్‌గా గుర్తించారు. జోగి ర‌మేష్ కుమారుడు రాజీవ్‌కు స్నేహితుడని ప్ర‌చారం జ‌రుగుతోంది. మొత్తంగా జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న అన‌గానే ఏవొ ఒక మ‌ర‌ణాలు చోటు చేసుకుంటున్నాయి.

This post was last modified on February 7, 2026 8:42 am

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

3 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

4 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

4 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

6 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

8 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

8 hours ago