Political News

ప్ర‌జ‌లే మీకు ఓటేయ‌లేదు… ‘పీకే’కు సుప్రీం షాక్

రాజ‌కీయ మాజీ వ్యూహ‌క‌ర్త‌.. జ‌న్ సురాజ్ పార్టీ అధినేత ప్ర‌శాంత్ కిషోర్ ఉర‌ఫ్ పీకేను ఉద్దేశించి సుప్రీంకోర్టు కీల‌క ప్ర‌శ్న‌లు సంధించింది. బీహార్‌లో గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్ర‌భుత్వం మ‌రోసారి విజ‌యం ద‌క్కించుకుంది. అంతేకాదు.. గతానికి భిన్నంగా ఈ ద‌ఫా ఓట్లు, సీట్లు కూడా ఈ కూట‌మికి పెరిగాయి. అదేస‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ త‌న అస్తిత్వాన్ని స్వ‌ల్పంగా నిల‌బెట్టుకుంది. ఎంఐఎం కూడా ప‌లు స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుంది.

ఇక‌, తొలిసారి రాజ‌కీయ పార్టీ పెట్టి.. దానిని అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలోకి దింపిన‌.. పీకే మాత్రం ఈ ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పాల‌య్యారు. 238 స్థానాల్లో త‌న పార్టీ త‌ర‌ఫున అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టినా.. ఆయ‌న ఒక్క చోట కూడా డిపాజిట్ ద‌క్కించుకోలేక పోయారు. ఇక‌, ఈ ఎన్నిక‌ల‌కు పీకే పోటీ చేయ‌కుండా దూరంగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల్లో ఏదో మ‌త‌ల‌బు జ‌రిగింద‌ని.. వ‌రుస‌గా ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డం అనేది చాలా అరుదైన ఘ‌ట‌న అని పేర్కొంటూ.. ఏకంగా సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు.

ఈ పిటిష‌న్‌ను విచార‌ణకు తీసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాక‌రించింది. ఈ పిటిష‌న్‌ను ప‌రిశీలించిన సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జ‌లే మీకు ఓటేయ‌లేదని.. గెలిపించ‌లేద‌ని.. ఈవీఎంల‌తో సంబంధం ఉంటుంద‌ని ఎలా ఆరోపిస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అంతేకాదు.. మీకు ఓట్లు ప‌డి.. ఒక్క‌చోటైనా గెలిచి ఉంటే.. కోర్టుకు వ‌చ్చేవారా? అని ప్ర‌శ్నించారు. కానీ, రాజకీయంగా కోర్టును వినియోగించుకునేందుకు ప్ర‌య‌త్నించార‌ని పీకేపై కోర్టు మండిప‌డింది.

న్యాయస్థానాల‌ను రాజ‌కీయ వేదిక‌గా మ‌లుచుకోవ‌డానికి తాము ఎప్ప‌టి ప‌రిస్థితిలోనూ అనుమ‌తించేది లేద‌న్నారు. కాగా.. ఎన్నిక‌ల‌కు ముందు.. కూట‌మి నాయ‌కులు.. మహిళకు 10 వేల చొప్పున పంచార‌ని.. ఇది ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేసిన‌ట్టు కాదా? అని పీకే త‌ర‌ఫున న్యాయ‌వాది ప్ర‌శ్నించారు. అయితే.. షెడ్యూల్ రాక‌ముందు ఉన్న ప‌థ‌కాలను కొన‌సాగించుకునే స్వేచ్ఛ అన్ని ప్ర‌భుత్వాల‌కూ ఉంటుంద‌న్న ఆయ‌న‌.. కూటమి గెలుపు చెల్లదని ప్రకటించాలని కోర‌లేర‌ని.. ఆ ప‌ని తాము చేయ‌బోమ‌ని వ్యాఖ్యానించారు.

This post was last modified on February 6, 2026 2:25 pm

Share

Recent Posts

ఆలస్యం ‘ఆదర్శం’ కాకుంటే చాలు

ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…

4 hours ago

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

9 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

11 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

11 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

13 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

14 hours ago