Political News

అమెరికా తర్వాత భారత్ డీల్ ఎవరితో మోడీజీ?

ప్రపంచ దేశాల మధ్య ట్రేడ్ వార్ నడుస్తున్న వేళ ఇండియా తన రూట్ మార్చింది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ పరిధిలోని సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ వంటి ఆరు దేశాలతో భారీ వాణిజ్య ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ లేదా చైనా కంటే కూడా ఈ గల్ఫ్ దేశాలే మనకు అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్‌నర్లుగా నిలుస్తున్నాయి. అందుకే ఈ దేశాలతో కుదుర్చుకోబోయే కొత్త ఒప్పందం మన ఆర్థిక వ్యవస్థకు ఒక టర్నింగ్ పాయింట్ కానుంది.

ఇప్పటికే యూఏఈ, ఒమన్‌ దేశాలతో మనకు స్పెషల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు జరగబోయే ఆరు దేశాల ఉమ్మడి ఒప్పందం వల్ల భారతీయ ఎగుమతులపై ట్యాక్సులు భారీగా తగ్గుతాయి. ముఖ్యంగా మన దగ్గర తయారయ్యే ఎలక్ట్రానిక్స్, కెమికల్స్, జెమ్స్ అండ్ జువెలరీకి గల్ఫ్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ డీల్ ఓకే అయితే మన కంపెనీలకు అక్కడ వ్యాపారం చేయడం చాలా ఈజీ అవుతుంది. అటు నుంచి మనకు కావాల్సిన ముడి చమురు, గ్యాస్ సప్లైలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

గతేడాది లెక్కల ప్రకారం ఇండియా గల్ఫ్ మధ్య సుమారు 179 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగింది. మనం ఎక్కువగా ఆ దేశాల నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటుంటే, మనవాళ్లు అక్కడికి బియ్యం, మాంసం, మెటల్స్ వంటివి పంపిస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో దాదాపు కోటి మంది భారతీయులు నివసిస్తున్నారు, ఇది మనకు మరో ప్లస్ పాయింట్. కేవలం ఎనర్జీ సెక్యూరిటీ కోసమే కాకుండా, మన కుర్రాళ్ల టాలెంట్‌ను, సర్వీసులను అక్కడ వాడుకోవడానికి ఈ ఒప్పందం ఒక దారి చూపిస్తుంది.

నిజానికి ఈ చర్చలు 2006లోనే మొదలైనా కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ నేతృత్వంలో ఈ డీల్‌పై కసరత్తు వేగవంతమైంది. పెట్రో కెమికల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో ఉన్న మన కంపెనీలకు గల్ఫ్ దేశాల్లో భారీ అవకాశాలు దక్కనున్నాయి. అమెరికా మార్కెట్ మీద మాత్రమే ఆధారపడకుండా, పక్కనే ఉన్న గల్ఫ్ మార్కెట్‌ను మనం ఒడిసిపట్టుకుంటే ఇండియా గ్రోత్ రేట్ ఇంకో లెవల్‌లో ఉంటుంది.

గల్ఫ్ దేశాల దగ్గర బోలెడు డబ్బు ఉంది, మన దగ్గర స్కిల్డ్ వర్కర్లు ఉన్నారు. ఈ రెండింటినీ కలిపితే రెండు వైపులా లాభమే. అయితే దిగుమతులు ఎక్కువ, ఎగుమతులు తక్కువ ఉండటం.. అనేది ఒక సవాలుగా ఉంది. సౌదీ, ఖతార్ వంటి దేశాల నుంచి మనం కొనే గ్యాస్, ఆయిల్ విలువ ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. ఈ కొత్త ఒప్పందంతో మన ఎగుమతులు పెరిగితే ఆ గ్యాప్ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. అందుకే ఈ మెగా ట్రేడ్ డీల్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

This post was last modified on February 6, 2026 3:02 pm

Share

Recent Posts

విజ‌య‌వాడ సెంట్ర‌ల్ రాజ‌కీయం మామూలుగా లేదే.. !

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజ‌కీయాలు కూట‌మిలోనే అంత‌ర్గ‌త వివాదాల‌కు కేంద్రంగా మారుతోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం పూర్తిగా ప‌ట్ట‌ణ ప‌రిధిలో ఉంది.…

33 minutes ago

ఆలస్యం ‘ఆదర్శం’ కాకుంటే చాలు

ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…

5 hours ago

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

10 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

12 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

12 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

14 hours ago