Movie News

నిరసనల దెబ్బకు దిగి వచ్చిన నెట్ ఫ్లిక్స్

మనోజ్ బాజ్ పాయ్ హీరోగా రూపొందిన ఓటిటి మూవీ ఘుస్కోర్ పండత్ త్వరలో నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే టైటిల్ లో ఒక సామజిక వర్గాన్ని అవమానపరిచేలా లంచగొండి పండితుడు అని పెట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో తీవ్ర నిరసన రేగింది.

తొలుత ట్వీట్లకే పరిమితమైనప్పటికీ తర్వాత కోర్టులు, కేసులు, పోలీసులు అంటూ పలువురు న్యాయ స్థానాన్ని ఆశ్రయించడంతో నెట్ ఫ్లిక్స్ ఈ కంటెంట్ కు సంబంధించిన వీడియోలు, పోస్టర్లు తొలగించేసింది. వివాదం పరిష్కారం అయ్యేదాకా ఇప్పుడప్పుడే దాని ప్రస్తావన రాకపోవచ్చు. సో ఆగ్రహాలు కొంత చల్లారొచ్చు.

షో క్రియేటర్ నీరజ్ పాండే, మనోజ్ బాజ్ పాయ్ ఇద్దరూ దీని గురించి స్పందిస్తూ అందరి మనోభావాలను గౌరవిస్తున్నామని, ఎవరినో అవమానపరచాలని ఇది తీయలేదని, అయినా సరే కొందరు బాధ పడ్డారు కాబట్టి వాళ్ళకు క్షమాపణ చెబుతూ తదుపరి చర్యలకు ఉపక్రమిస్తామని అందులో పేర్కొన్నారు.

సో టైటిల్ మార్పు దాదాపు ఖాయమే. లంచాలకు మరిగిన ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఘుస్కోర్ పండత్ రూపొందింది. ట్రైలర్ అంచనాలు పెంచడంలో ఉపయోగపడింది. ఇప్పుడు చూద్దామన్నా యూట్యూబ్ లో తీసేశారు. సో పేరు మార్పు దాకా వెయిట్ చేయాలి.

మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే జనాలు ఇంత వేగంగా రియాక్ట్ కావడం. ఒక వర్గాన్ని, మతాన్ని, కులాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదు. అలాంటి అవకాశం ఉందని తెలిసినప్పుడు దర్శక నిర్మాతలు తమ పద్ధతి మార్చుకోవాలి. అంతే తప్ప క్రియేటివ్ ఫ్రీడమ్ పేరుతో ఇలా చేస్తామంటే కుదరదు.

గతంలో గద్దలకొండ గణేష్ సినిమా విషయంలో ఇలాంటి కాంట్రావర్సి వచ్చిన సంగతి తెలిసిందే. ముందు నిర్ణయించిన వాల్మీకి టైటిల్ మార్చే దాకా వివాదం చల్లారలేదు. కొమరం పులి టైంలోనూ ఇలాగే జరిగింది. మరి నీరజ్ పాండే బృందం ఇప్పుడు ఎలాంటి పేరు ఎంచుకుంటారో వేచి చూడటం తప్ప ఆప్షన్ లేదు.

This post was last modified on February 6, 2026 2:15 pm

Share

Recent Posts

విజ‌య‌వాడ సెంట్ర‌ల్ రాజ‌కీయం మామూలుగా లేదే.. !

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజ‌కీయాలు కూట‌మిలోనే అంత‌ర్గ‌త వివాదాల‌కు కేంద్రంగా మారుతోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం పూర్తిగా ప‌ట్ట‌ణ ప‌రిధిలో ఉంది.…

33 minutes ago

ఆలస్యం ‘ఆదర్శం’ కాకుంటే చాలు

ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…

5 hours ago

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

10 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

12 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

12 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

14 hours ago