Political News

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు.. అసలు వైసీపీ వ్యవహార శైలి ఎలా ఉంటుంది? హిందూ ధర్మం, ఆలయాల విషయంలో ఆ పార్టీ అనుసరిస్తున్న తీరు ఎలా ఉంది? అనేది ఆయన వివరించారు. పాయింట్ల వారీగా చూస్తే సీఎం చంద్రబాబు లేవనెత్తిన అనేక అంశాలు వైసీపీని అత్యంత ఇరుకున పెట్టే అంశాలుగా మారాయి.

ప్రధానంగా:

1) అంతర్వేది:
వైసీపీ హయాంలో అంతర్వేదిలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి చెందిన రథం దగ్ధమైంది. ఈ విషయాన్ని సీఎం ప్రస్తావించారు. నాడు వైసీపీ నేతలు ఈ విచారణకు కూడా అడ్డుపడ్డారని, సీబీఐకి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా తప్పించుకున్నారని అన్నారు. పైగా తేనెతుట్టెకు పొగ పెట్టడం వల్లే మంటలు వ్యాపించాయని, అందుకే రథం తగలబడిందని చెప్పారని తెలిపారు. దీంతో ఇప్పుడు వైసీపీ ఈ విషయంపై గతంలో ఏమి చేసిందన్నది చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.

2) అనంతపురం ఘటన:
వైసీపీ హయాంలో అనంతపురం జిల్లాలో ఆంజనేయుడి విగ్రహాన్ని పగలగొట్టారు. దీనిపైనా పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. అయితే అప్పట్లో వైసీపీ నాయకులు లైట్ తీసుకున్నారు. “అదో బొమ్మే కదా, ఇంకోటి పెట్టుకోండి” అని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని కూడా ప్రజల్లోకి చంద్రబాబు తీసుకువెళ్లనున్నారు. దీనిపై కూడా వైసీపీ అంతర్మథనంలో పడే అవకాశం కనిపిస్తోంది.

3) రామతీర్థం:
విజయనగరం జిల్లా రామతీర్థంలోని శ్రీరాముడి విగ్రహం శిరఛ్ఛేదనం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. హుటాహుటిన కొత్త విగ్రహం ప్రతిష్ఠించినా, ఆనాడు ఈ ఘటనపై వైసీపీ పాలకులు మసిపూసి మారేడు చేశారన్న వాదన ఉంది. అందుకే ఇప్పుడు మళ్లీ ఈ విషయాన్ని ప్రజల మధ్యకు తీసుకువెళ్లనున్నారు. దీనిపై కూడా వైసీపీ ఇరుకున పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

4) బెజవాడ దుర్గమ్మ:
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయ రథంలో ఉన్న వెండి సింహాలను దొంగిలించారు. ఈ వ్యవహారంపైనా వైసీపీ నాయకులు తూతూ మంత్రంగా విచారణ చేయించారని ఆరోపణ ఉంది. దీనిపైనా ఇప్పుడు కూటమి ప్రజల్లో ఎండగట్టనుంది. దీనికి వైసీపీ నాయకులు ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.

5) తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ:
ప్రధానంగా తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారానికి సంబంధించి 2022లోనే గత వైసీపీ ప్రభుత్వానికి నివేదిక అందిందని చెబుతున్నారు. సీఎఫ్టీఆర్ఐ ఇచ్చిన నివేదికలో నెయ్యి కల్తీ జరుగుతోందని స్పష్టంగా ఉందని అంటున్నారు. కానీ ఆ నివేదికను అప్పట్లో పక్కన పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కూడా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లనున్నారు. అప్పట్లో ఏమి జరిగింది? ఎందుకు చర్యలు తీసుకోలేదు? అనే ప్రశ్నలకు వైసీపీ సమాధానం ఇవ్వాల్సి ఉంది. కానీ అలాంటి ప్రశ్నలకు ఆ పార్టీ వద్ద సమాధానం ఉందా? అనేది చర్చనీయాంశంగా మారింది.

This post was last modified on February 5, 2026 10:06 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

2 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

3 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

3 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

5 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

5 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

6 hours ago