Movie News

వారణాసి సంగీతం మీద ఆర్ఆర్ఆర్ బరువు

ప్రపంచ వేదిక మీద సగర్వంగా ఆస్కార్ అందుకున్న ఎంఎం కీరవాణి మీద ఇప్పుడు అతి పెద్ద బాధ్యత ఉంది. వారణాసికి ఇవ్వబోయే సంగీతం గురించి కేవలం టాలీవుడ్ లవర్సే కాదు వరల్డ్ వైడ్ సినీ ప్రియులు కోట్ల సంఖ్యలో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా నాటు నాటుని మించిన కంపోజింగ్ ఇందులో ఉండాలని కోరుకుంటున్నారు.

అయితే ఇలా లేనిపోని హైప్ ఇచ్చి అంచనాలు పెంచేసి, నిరాశ పరచడం కంటే, ముందే క్లారిటీ ఇస్తే బెటరనే ఉద్దేశంతో రెండు నెలల క్రితం ఒక ప్రముఖ ఇంగ్లీష్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీరవాణి ఈ ప్రస్తావన తెచ్చారు. దాని ప్రకారం వారణాసిలో ఆరు పాటలు ఉంటాయి.

అలాని ఆర్ఆర్ఆర్ ని మించిపోయేలానో లేదా దాన్ని తలదన్నేలా ఉంటాయనో కీరవాణి హామీ ఇవ్వడం లేదు. రెండు ఏ కోణంలోనూ సంబంధం లేని వేర్వేరు కథలని, సంగీత ప్రియులను మెప్పించేందుకు అవసరమైన ఎపిసోడ్స్, సాంగ్స్, సీక్వెన్సెస్ అన్నీ ఉంటాయని, కాబట్టి పోలిక అవసరం లేదని తేల్చి చెప్పేశారు.

ఇప్పటికే సంచారి సాంగ్ జనాన్ని ఆకట్టుకోగా ఇది మెయిన్ ఆల్బంలో ఉంటుందా లేదానేది ఇంకా సస్పెన్స్ గానే ఉంచుతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7 విడుదల కాబట్టి ప్రమోషన్ల టైం దగ్గరపడినప్పుడు కీరవాణి మ్యూజిక్ కు సంబంధించిన మరిన్ని విశేషాలు పంచుకోబోతున్నారు.

ఇంత లేటు వయసులో బెస్ట్ ఇచ్చేందుకు కష్టపడుతున్న కీరవాణి వారణాసితో కనక మరోసారి మేజిక్ చేయగలిగితే అంతర్జాతీయ స్థాయిలో పేరు మళ్ళీ మారు మ్రోగుతుంది. ఈసారి ఆస్కార్ అవకాశాలను పెంచుకునేందుకు రాజమౌళి, ఎస్ఎస్ కార్తికేయ ఇప్పటి నుంచే ప్రణాళికతో ఉన్నారు.

ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా ఏమేం చేయాలో, ఏమేం కావాలో అన్నీ సమకూర్చుకుంటున్నారు. వేసవికల్లా షూటింగ్ పూర్తి చేయాలనేది జక్కన్న స్కెచ్. అదే జరిగితే పోస్ట్ ప్రొడక్షన్, పబ్లిసిటీకి ఎక్కువ సమయం దొరుకుతుంది. మహేష్ కూడా వేరే  సినిమాలు, కథల గురించి ఆలోచించకుండా పూర్తిగా వారణాసికి అంకితమైపోయాడు.

This post was last modified on February 5, 2026 5:38 pm

Share

Recent Posts

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

1 hour ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

1 hour ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

2 hours ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

4 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

6 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

8 hours ago