వైసీపీ అధినేత జగన్ పర్యటనలు ప్రజలకు గుదిబండలుగా మారాయా? ఆయన బయటకు వస్తుంటే.. తమకు ఇబ్బందిగా ఉందని ప్రజలు చెబుతున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం జగన్ పర్యటన పెట్టుకున్నారు. మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు సీఎం చంద్రబాబు పై చేసిన దుర్భాషల నేపథ్యంలో కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు.
ఈ నేపథ్యంలో అంబటి కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ గుంటూరు పర్యటన పెట్టుకున్నారు. కానీ, గత అనుభవాల నేపథ్యంలో గుంటూరును పోలీసులు అష్టదిగ్భంధం చేశారు. ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. బారికేడ్లు పెట్టారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో ప్రజలు జగన్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జగన్ వస్తుంటే.. తమ గుండెల్లో దడ పుడుతోందని.. గుంటూరు వాసులు.. పలు ఆన్‌లైన్ మీడియా ఛానెళ్లకు ఇచ్చిన బైట్లలో చెబుతున్నారు.
ఇక, జగన్ పర్యటించనున్న మార్గాల్లోని అన్ని దుకాణాలను కూడా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు మూసి వేయించారు. దీంతో నిర్మానుష్య వాతావరణం నెలకొంది. మరోవైపు.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో జగన్ పర్యటనను అడ్డుపెట్టుకుని ఆ పార్టీ నాయకులు మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు.. వారికి ముందస్తు హెచ్చరికలు, నోటీసులు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు.. బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ ఏసురత్నం వంటివారికి నోటీసులు ఇచ్చారు.
కాగా.. గతంలో జగన్ పర్యటించినప్పుడు.. ఆ పార్టీ కార్యకర్త ఒకరు.. జగన్ కాన్వాయ్ కింద పడి మృతి చెందారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించింది. దీనిపై విచారణ కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే స్థానికులు భయం గుప్పిట్లో ఉన్నారన్నది సమాచారం. ఒక నాయకుడు పర్యటించడం ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ, ఈ పర్యటనను ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా చేయడమే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది.
This post was last modified on February 4, 2026 3:39 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…