ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా కుల వివక్ష మీద ఆయన సంధించిన అస్త్రం కమర్షియల్ గానూ మంచి ఫలితాన్నే ఇచ్చింది. అందుకే శ్రీదేవి సోడా సెంటర్ లాంటి మంచి బడ్జెట్ పెట్టిన మూవీ చేతికి వచ్చింది.
కల్ట్ క్లాసిక్ ఇవ్వాలనే తాపత్రయంతో సుధీర్ బాబుతో కలిసి చేసిన ప్రయత్నం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఆ తర్వాత కళాపురం అనే చిన్న మూవీ చేస్తే ఊసులో లేకుండా పోయింది. అయినా సరే వరుణ్ తేజ్ నమ్మి మట్కాకు ఓకే చెప్పాడు. ఈసారి కోట్ల బడ్జెట్ పెట్టారు. కానీ అల్ట్రా డిజాస్టర్ మిగిలింది. ఇదంతా గతం
ఇప్పుడు కరుణ కుమార్ ప్రస్తుతం నడుస్తున్న హారర్ ట్రెండ్ కు వచ్చేశారు. నవీన్ చంద్రతో హనీ అనే మూవీ తీశారు. ఈ వారమే ఫిబ్రవరి 6 ఇది విడుదల కానుంది. ట్రైలర్ చూస్తే షాకింగ్ ఎలిమెంట్స్ ఉన్న ఫీలింగ్ కలిగింది. నిజ జీవితంలో ఉన్న కొన్ని క్షుద్ర విద్యలను ఆధారంగా చేసుకుని హనీని రూపొందించినట్టు కరుణ కుమార్ చెబుతున్నారు.
ఈ వారంలో చూస్తే పెద్దగా పోటీ లేదు. గుణశేఖర్ యుఫొరియా ఉంది కానీ దాని మీద కూడా అంతగా బజ్ ఏర్పడటం లేదు. హారర్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి హనీ టాక్ కనక పొలిమేర తరహాలో తెచ్చుకుంటే బాక్సాఫీస్ వద్ద గట్టెక్కే ఛాన్స్ ఉంటుంది.
ఒకరకంగా చెప్పాలంటే కరుణ కుమార్ కి ఇది విషమ పరీక్ష. డైరెక్టర్ గా తనను తాను మళ్ళీ ఋజువు చేసుకోవాలి. అసలు అన్ని ఫ్లాపుల తర్వాత కూడా ఆఫర్లు వస్తున్నాయంటే అది పలాస ప్రభావమే అని చెప్పాలి. దాన్ని నిలబెట్టుకునే దిశగా హనీతో మంచి రిజల్ట్ అందుకుంటే తప్ప నోటెడ్ హీరోల దగ్గరకు వెళ్లే ఛాన్స్ ఉండదు.
ప్రస్తుతం ఒక టయర్ 2 స్టార్ ని ఒప్పించే పనిలో ఉన్న కరుణ కుమార్ అందులో సక్సెస్ కావాలంటే ముందు హనీతో రుజువు చేసుకోవాలి. అటు నవీన్ చంద్ర కూడా పెద్ద బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. వరస సినిమాలు వస్తున్నాయి కానీ మినిమమ్ హిట్ లేదు. మరి హనీ ఏం చేస్తుందో చూడాలి.
This post was last modified on February 4, 2026 1:35 am
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…