మహారాష్ట్రలో మునిసిపల్ కార్పొరేషన్, మునిసిపల్ ఎన్నికలు ముగిశాయి. ఇప్పటికే ఈ రిజల్ట్ కూడా వచ్చేసింది. ఇక, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రక్రియ తెరమీదికి వచ్చింది. కొద్ది రోజుల్లో ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ కోలాహలం నెలకొంది.
అయితే.. ఈ ఎన్నికల్లో పోటీచేసేందుకు కొన్ని నిబంధనలు ఉంటాయి. రిజర్వేషన్‌తో పాటు సంతానంపై కూడా.. సీలింగ్ ఉంటుంది. ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉంటే.. గ్రామీణ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు అవుతారు. ఇది ఎప్పటి నుంచో ఉన్న నిబంధన. దీంతో ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారు.. పోటీ చేయడం లేదు.
అయితే.. తనకు ఎక్కువ మంది సంతానం ఉన్నప్పటికీ.. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలన్న అభిలాషతో ఓ నాయకుడు దారుణానికి ఒడిగట్టాడు. తనకు ముగ్గురు పిల్లలు ఉండడంతో నిబంధనల ప్రకారం నామినేషన్ వేసేందుకు అర్హుడు కాదని తెలుసుకున్న ఓ గ్రామ స్థాయి నాయకుడు.. తన పిల్లల్లోని ఆరేళ్ల ఆడపిల్లను చంపేశాడు.
తద్వారా.. తనకు ఇద్దరు పిల్లలేనని నమ్మించి.. ఎన్నికల ప్రక్రియకు రెడీ అయ్యాడు. కానీ.. ఈ వ్యవహారం దాగలేదు. తాజాగా తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని నిజాం సాగర్ కెనాల్‌లో సదరు చిన్నారి మృత దేహం లభ్యమైంది. దీంతో కూపీ లాగిన పోలీసులు అసలు వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చారు.
మహారాష్ట్రలోని ముఖేడ్ తాలూకా కేరూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని పాండురంగ బాబు(41) నిర్ణయించుకున్నాడు. కానీ, ఆయనకు ముగ్గురు సంతానం. దీంతో ఆయన పోటీకి అనర్హుడయ్యాయి. ఈ పరిణామాల క్రమంలో ఒక పిల్లను తప్పిస్తే.. తాను పోటీకి అర్హత సాధిస్తానని పన్నాగం పన్నిన ఆయన.. తన సన్నిహితులతో కలిసి పెద్ద కుమార్తె ప్రాచీని గొంతు నొక్కి.. తెలంగాణ సరిహద్దుల్లోని ఎడపల్లికి తీసుకువచ్చి కెనాల్‌లోకి నెట్టేశాడు.
నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి బాలిక మృతి చెందింది. ఈ మృతదేహం నాలుగు రోజుల కిందట.. నిజాంసాగర్ కెనాల్‌లో కనిపించింది. దీనిపై పెద్ద ఎత్తున విచారణ చేశారు. అనేక సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.
దీంతో లోతుగా విచారణ జరిపిన పోలీసులు.. చివరకు ఈ బాలిక హత్య వెనుక.. పంచాయతీ ఎన్నికలు ఉన్నాయన్న కోణాన్ని వెలుగులోకి తెచ్చారు. వాస్తవానికి ఐదేళ్ల పదవి కోసం.. డబ్బులు ఖర్చు చేసేవారు ఉన్నారు. లేదా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేవారు ఉన్నారు. కానీ, ఇలా కడుపున పుట్టిన బిడ్డను కూడా చంపుకునే వారు ఉంటారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయింది. పదవి కోసం.. ఎంతకైనా బరితెగిస్తారన్నదానికి ఇది ఉదాహరణగా మారింది.
This post was last modified on February 2, 2026 9:12 pm
ఒక తెలుగు సినిమా పాతిక రోజులకు పైగా స్ట్రాంగ్ రన్ చూసి ఎంత కాలమయ్యిందంటే వెంటనే సమాధానం చెప్పడం కష్టం.…
సెలబ్రిటీల జీవితం పైకి ఎంత ఆకర్షణగా కనిపిస్తుందో లోపల అంత ఘర్షణ ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది ఎక్కువగా…
బీజేపీతో ప్రతిపక్ష బీఆర్ఎస్ లోపాయికారీగా పొత్తు పెట్టుకుందని అధికార కాంగ్రెస్ పార్టీ తరచుగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి…
నేచురల్ స్టార్ నాని తన కెరీర్లోనే అతి పెద్ద పరీక్షకు సిద్ధమవుతున్నాడు. వచ్చే గురువారం తన కొత్త చిత్రం ‘ది…
థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్నారు అని.. సింగిల్ స్క్రీన్లు మూతపడిపోతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న దశలో గత మూడు నెలలుగా…
వచ్చే సంక్రాంతికి విశ్వంభర రిలీజవుతుందని, కాకా వేసవికి వెళ్లిపోవచ్చనే ప్రచారం గత వారం రోజులుగా చాలా బలంగా తిరుగుతోంది. తుది…