Political News

బాబును తిడితే మైలేజీ పెరుగుతుందా..!

సీఎం చంద్రబాబును తిట్టడం ద్వారా గ్రాఫ్ పెరుగుతుందా అనేది ఇప్పుడు టిడిపిలోనూ అటు వైసిపిలోనూ చర్చ నడుస్తోంది. వ్యక్తిగత లాభం కోసం చంద్రబాబును దూషించిన చాలామంది నాయకులు ఫేడ్ అవుట్ అయ్యారు. ఇలాంటి వారిలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ప్రస్తుతం జైలు పాలైన అంబటి రాంబాబు కూడా గత ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలయ్యారు.

ఈ ముగ్గురు గతంలో వైసిపి అధినేతగా ఉన్న చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేసిన వారే. అదేవిధంగా మంత్రి నారా లోకేష్ ను తీవ్రస్థాయిలో దూషించిన వారే. నారా లోకేష్ ను విమర్శించిన వారి జాబితాలో చాలామంది ఉన్నారు. కానీ చంద్రబాబును ప్రత్యేకంగా టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేసిన వారిలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ముందువరుసలో నిలిచారు. అసెంబ్లీ వేదికగానే వారు చంద్రబాబును దూషించారు. చంద్రబాబు సతీమణి, ఆయన కుటుంబంపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఖర్జూర నాయుడు కిస్మిస్ నాయుడు అంటూ చంద్రబాబు తండ్రిపై ఆనాడు కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ యూట్యూబ్లో వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా అంబటి రాంబాబు చేసిన దుర్భాషలు కూడా తీవ్ర విమర్శలకు దారి తీశాయి. నిజానికి చంద్రబాబును తిట్టినందువల్ల ఎవరి గ్రాఫ్ పెరగలేదన్న విషయం గత ఎన్నికల్లోనే స్పష్టమైంది. చంద్రబాబును లక్ష్యంగా చేసుకున్న పలువురు నేతలు ఓటమిపాలయ్యారు. వైసీపీకి గాలి లేకపోవడం ఒక కారణమైతే, చంద్రబాబుపై వ్యక్తిగత దాడులు ప్రజల్లో ప్రతికూల భావన కలిగించాయన్న అభిప్రాయం వినిపించింది.

అందుకే ఐదు సార్లు విజయం సాధించిన కొడాలి నాని సైతం గత ఎన్నికల్లో పరాజయం చవిచూశారు. ఇక ఇప్పుడు కూడా అదే విధానాన్ని కొనసాగిస్తే వైసిపి నాయకులకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్నది ఆసక్తిగా మారింది. ఎన్నికల్లో మళ్లీ గెలవాలంటే చంద్రబాబును టార్గెట్ చేయడం కంటే ప్రజల మధ్యకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తేనే నాయకులకు ప్రాధాన్యం పెరుగుతుందని పరిశీలకులు చెబుతున్నారు.

ఈ దిశగా కొంతమంది వైసిపి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటికీ కొందరు నాయకులు చంద్రబాబును విమర్శించడం ద్వారా టిడిపిని రెచ్చగొట్టి లాభం పొందాలనే ప్రయత్నం చేయడం ఆ పార్టీకి మేలు చేయదని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇటువంటి పరిణామాలను ప్రజలు సహించరని అంటున్నారు. భవిష్యత్తులో అయినా విజయం సాధించాలంటే, ప్రజల మద్దతు పొందాలంటే చంద్రబాబు లేదా లోకేష్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం మానేసి అభివృద్ధి, గతంలో జరిగిన పొరపాట్ల సవరణ దిశగా అడుగులు వేయడం మంచిదని సూచిస్తున్నారు.

This post was last modified on February 2, 2026 9:35 pm

Share

Recent Posts

ఒక్క విషయంలో ఇరుముడికి అపోజిషన్

ఒక తెలుగు సినిమా పాతిక రోజులకు పైగా స్ట్రాంగ్ రన్ చూసి ఎంత కాలమయ్యిందంటే వెంటనే సమాధానం చెప్పడం కష్టం.…

32 minutes ago

ఆ ఒక్క ఫోటో ఆమె కేరీర్ ను దెబ్బతీసింది

సెలబ్రిటీల జీవితం పైకి ఎంత ఆకర్షణగా కనిపిస్తుందో లోపల అంత ఘర్షణ ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది ఎక్కువగా…

46 minutes ago

బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు….

బీజేపీతో ప్రతిపక్ష బీఆర్ఎస్ లోపాయికారీగా పొత్తు పెట్టుకుందని అధికార కాంగ్రెస్ పార్టీ తరచుగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి…

58 minutes ago

ప్యారడైజ్.. మామూలు టాక్ సరిపోదు

నేచురల్ స్టార్ నాని తన కెరీర్లోనే అతి పెద్ద పరీక్షకు సిద్ధమవుతున్నాడు. వచ్చే గురువారం తన కొత్త చిత్రం ‘ది…

3 hours ago

హైదరాబాద్ బెస్ట్ సింగిల్ స్క్రీన్ రెడీ

థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్నారు అని.. సింగిల్ స్క్రీన్లు మూతపడిపోతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న దశలో గత మూడు నెలలుగా…

4 hours ago

కొత్త దారులు వెతకాలి విశ్వంభరా

వచ్చే సంక్రాంతికి విశ్వంభర రిలీజవుతుందని, కాకా వేసవికి వెళ్లిపోవచ్చనే ప్రచారం గత వారం రోజులుగా చాలా బలంగా తిరుగుతోంది. తుది…

4 hours ago