మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తన సోదరుడు కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలపై, సీఎం రేవంత్ రెడ్డిపై కవిత కొంతకాలంగా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో కవిత చేరతారని ప్రచారం జరుగుతున్నా…అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అని, కానీ, తాను వ్యతిరేకిస్తున్నానని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు చేసినట్టు తిరిగిన వార్తలు డిబేట్ కు దారి తీసాయి.
ఈ క్రమంలోనే మహేష్ కుమార్ గౌడ్ కు కవిత కౌంటరిచ్చారు. ఓ చిట్ చాట్ సందర్భంగా తాను కాంగ్రెస్ లోకి వస్తానంటే మహేష్ కుమార్ వద్దన్నారని ప్రచారం జరుగుతోందని, దానిని ఖండించారు. తాను కాంగ్రెస్‌లో చేరనని, అసలు ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదని కవిత జోస్యం చెప్పారు.
అంతేకాదు, మహేష్ అన్న జాగృతి పార్టీలో చేరాలని, భవిష్యత్తులో తాను స్థాపించే పార్టీనే అధికారంలోకి వస్తుందని అన్నారు. మహేష్ గౌడ్ కు జాతీయ కన్వీనర్ గా తన పార్టీలో కీలక పదవి ఇస్తానని కవిత చెప్పారు. తన పార్టీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతేగానీ, తనను బద్నాం చేయొద్దని కోరారు. ఒకవేళ తాను కాంగ్రెస్ లోకి వస్తానని మహేషన్నకు కల వచ్చిందేమోనని, ఎవరికైనా చూపించుకోవాలని సెటైర్లు వేశారు. తన కొత్త పార్టీకి సంబంధించి కమిటీల నియామకం వంటి ప్రక్రియలో బాగా బిజీగా ఉన్నామని, పకడ్బందీగా పార్టీని సెట్ చేసుకునే పనిలో ఉన్నామని చెప్పారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు ముందడుగు వేస్తామని, అప్పటి వరకు ఇటువంటి ప్రకటనలు, ప్రయత్నాలు చేయొద్దని కాంగ్రెస్ నేతలకు చురకలంటించారు.
This post was last modified on January 25, 2026 4:14 pm
ఏ ముహుర్తంలో డొనాల్డ్ ట్రంప్ ను రెండోసారి అమెరికాకు అధ్యక్షుడిగా అమెరికన్లు ఎన్నుకున్నారో కానీ.. అప్పటి నుంచి ప్రపంచ దేశాలకు…
మన దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో పద్మశ్రీ ఒకటి. కళలు, విద్య, వైద్యం, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి శాశ్వతమని, దీనిని ఎవరూ కదల్చలేరని ఆయన స్పష్టం…
టాలీవుడ్లో మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్ అయిన అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్ AA22పై బజ్ మాములుగా లేదు. భారీ బడ్జెట్తో…
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న 'ది ప్యారడైజ్' మూవీ రోజురోజుకూ అంచనాలను…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అత్యంత ఆనందాన్నిచ్చి, వారిని తీవ్ర భావోద్వేగానికి గురి చేసిన దర్శకుల్లో హరీష్ శంకర్…