తమిళనాడు రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైంది. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దళపతి విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు గుర్తును కేటాయించింది.
అరంగేట్రం చేస్తున్న ఈ పార్టీకి ‘విజిల్’ గుర్తును ఖరారు చేస్తూ ఈసీ గురువారం నిర్ణయం తీసుకుంది. విజయ్ బిగిల్ సినిమాను తెలుగులో విజిల్ పేరుతో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.. అదే గుర్తు ఇప్పుడు పార్టీకి రావడం విశేషం. అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా 2019లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి.
పార్టీ స్థాపించిన తర్వాత మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న విజయ్‌కు ఈ గుర్తు రావడం ఆయన అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. తమ పార్టీకి ఒక గుర్తును కేటాయించాలని కోరుతూ టీవీకే గత ఏడాది నవంబర్ 11న ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది.
ఈసీ జాబితాలో అందుబాటులో ఉన్న ఏడు గుర్తులతో పాటు, వారే స్వయంగా రూపొందించిన మూడు గుర్తులతో కూడిన జాబితాను విజయ్ బృందం సమర్పించింది. సుదీర్ఘ పరిశీలన తర్వాత ఎన్నికల చిహ్నాల ఉత్తర్వుల ప్రకారం ఈసీ ‘విజిల్’ గుర్తును కేటాయించింది. తమిళ క్రికెట్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ ను విజిల్ పోడు అంటూ తమిళ జనాభా ఎంతలా ఆరాధిస్తారో తెలిసిందే. ఈ క్రేజ్ విజయ్ ప్రచారణాకి బాగా ఉపయోగపడుతుంది.
మరోవైపు, లోకనాయకుడు కమల్ హాసన్ నేతృత్వంలోని ‘మక్కల్ నీది మయ్యమ్’ (MNM) పార్టీకి పాత గుర్తునే ఈసీ మళ్లీ కేటాయించింది. కమల్ పార్టీ ఈసారి కూడా ‘బ్యాటరీ టార్చ్’ గుర్తుపైనే పోటీ చేయనుంది. గత 2019 లోక్‌సభ ఎన్నికలు 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే గుర్తుపై కమల్ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడు విజయ్ రాకతో ఈసారి ఎన్నికలు మరింత రసవత్తరంగా మారనున్నాయి.
తమిళనాడు రాజకీయాల్లో హీరోల మధ్య పోరు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. దశాబ్దాలుగా ఎంజీఆర్, శివాజీ గణేశన్ నుంచి మొదలై విజయకాంత్, కమల్ హాసన్ వరకు ఎంతోమంది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడు విజయ్ ‘విజిల్’ వేస్తూ ప్రజల్లోకి వెళ్తుంటే, కమల్ తన ‘టార్చ్’ లైట్ వెలుగులో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరి మధ్య ఓట్ల చీలిక ఎవరికి లాభిస్తుందో అనే చర్చ కూడా మొదలైంది.
This post was last modified on January 22, 2026 3:24 pm
ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ ఐ-ప్యాక్ (I-PAC) ఆర్థిక లావాదేవీలపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి. 2021లో ఈ సంస్థ హర్యానాలోని…
రాజకీయ రంగప్రవేశానికి ముందు విజయ్ చివరి సినిమాగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న జన నాయకుడుకి కష్టాల కడలి అంత సులభంగా…
మార్చి 27 విడుదలని ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చిన పెద్ది ఖచ్చితంగా వాయిదా పడుతుందనే రీతిలో సోషల్ మీడియాలో ఒక…
మన శంకర వరప్రసాద్ గారుకి ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు నుంచి రెగ్యులర్ టికెట్ ధరలు అందుబాటులోకి వచ్చేశాయి. జిఓలో…
మరో ఆరు రోజుల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కీలకంగా అమరావతి రాజధానికి…
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో ఒక భార్య చేసిన ఘాతుకం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రియుడితో తన…