న్యాయవ్యవస్ధపై వ్యాఖ్యల కేసులో పెద్ద ట్విస్టు ?

న్యాయవ్యవస్ధపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అసలు ట్విస్టు బయటపడిందా ? విచారణ సందర్భంగా వెలుగుచూసిన విషయాల కారణంగా అందరిలోను ఇదే అనుమానం పెరుగుతోంది. ప్రభుత్వం విషయంలో హైకోర్టు చేస్తున్న వ్యాఖ్యలు, విచారణకు తీసుకుంటున్న పిటీషన్లు, విచారణకు ఇస్తున్నఆదేశాల నేపధ్యంలో అధికార వైసీపీ నేతలతో పాటు మరికొందరు జనాలు న్యాయవ్యవస్ధ వైఖరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో వాళ్ళు చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనమయ్యాయి. దాంతో మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిన ఆ వ్యాఖ్యల విషయంలో హైకోర్టు చాలా సీరియస్ అయ్యింది.

వ్యాఖ్యలు చేసిన వారిని గుర్తించి వారిపై వెంటనే కేసులు నమోదు చేసి హైకోర్టులో హాజరుపరచాలని హైకోర్టు న్యాయమూర్తులు సీఐడీని ఆదేశించారు. అయితే రెండు నెలలైనా సీఐడీ కేసులు నమోదు చేయకుండా ఎవరినీ అదుపులో తీసుకోలేకపోయింది. దాంతో సీఐడీపైన కూడా మండిపోయిన హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. సీఐడి సామర్ధ్యంపైనే కాకుండా పనితీరుపైన కూడా అప్పట్లు హైకోర్టు చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది.

సీన్ కట్ చేస్తే సీబీఐ కూడా ఎవరినీ ఇంతవరకు అదుపులోకి తీసుకోలేదని ఎవరిపైనా అదనంగా కేసులు పెట్టలేదని విచారణలో బయటపడింది. న్యాయవ్యవస్ధపై అనుచిత వ్యాఖ్యల పురుగోతిని హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా సీబీఐ విచారణలో పురోగతి ఏమీ లేదని అర్ధమైపోయింది. అంతేకాకుండా న్యాయవ్యవస్ధపై వ్యాఖ్యలు చేసిన వారిలో అత్యధికులు విదేశాల్లో ఉంటున్నట్లు సీబీఐ గుర్తించిందని సమాచారం. విదేశాల్లో ఉంటు ఇక్కడ న్యాయవ్యవస్ధపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళపై కేసులు ఎలా పెట్టాలి ? కేసులు పెట్టినా విచారణకు వాళ్ళను ఎలా పిలిపించాలన్నది పెద్ద సమస్యయికూర్చుంది.

ఇదే విషయాన్ని సీబీఐ కోర్టు విచారణలో చెప్పినపుడు హైకోర్టు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసిందట. ఏ ఏ మాధ్యమాల ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేశారన్న విషయాన్ని గుర్తించి ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేసినట్లు సీబీఐ కోర్టుకు చెప్పింది. మరి ఈ లెక్కన ప్రొవైడర్లకు నోటీసులు ఇస్తే ఏమవుతుంది ? విదేశాల్లో ఉన్నవారిపై కేసులు పెట్టి ఎలా రప్పించాలనే విషయంపై సీబీఐ అవస్తలు పడుతోంది.

ఏదైనా నేరం చేసి తప్పించుకుని వెళ్ళినపుడు వాళ్ళని పట్టి తెప్పించే అవకాశాలున్నాయి కానీ కేవలం వ్యాఖ్యలు చేసిన వారిని ఎలా రప్పించాలి ? అన్నదే ఇఫుడు సమస్యగా మారింది. అందుకనే ఓ నాలుగు నెలల సమయం గడువు అడగ్గానే కోర్టు కూడా ఓకే అని చెప్పేసింది. మరి నాలుగు నెలల తర్వాత సీబీఐ మళ్ళీ ఏమి చెబుతుందో చూడాల్సిందే.