Political News

నిన్న విజయ సాయి రెడ్డి… ఈరోజు మిథున్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును మరింత ఉద్ధృతం చేసింది. ఇప్పటికే వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసిన ఈడీ, తాజాగా ఆ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డికీ నోటీసులు పంపింది.

ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. అంతకుముందు 22న విజయసాయిరెడ్డి విచారణకు రావాలని కోరిన ఈడీ, వరుసగా మిథున్‌రెడ్డిని పిలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్ పాలనలో లిక్కర్ విధాన రూపకల్పన, అమలులో విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి కీలకంగా వ్యవహరించాలని దర్యాప్తు వర్గాలు ఆరోపిస్తున్నాయి. 

లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి ఏ5 నిందితుడిగా ఉన్నప్పటికీ, ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు సహకరిస్తున్న కారణంగా ఆయనను అరెస్టు చేయలేదని తెలుస్తోంది. మరోవైపు, మిథున్‌రెడ్డి మాత్రం సిట్ విచారణలో కీలక నిందితుడిగా మారారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లినా ఉపశమనం లభించక, ఆయనను సిట్ అరెస్టు చేసింది.

అనంతరం ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు. 2025లో వెలుగుచూసిన ఈ కుంభకోణంలో మిథున్‌రెడ్డి పాత్ర, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని సిట్ ఆరోపించింది. అధికారులను ప్రభావితం చేయడం, కీలక సమావేశాల్లో పాల్గొనడం, రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగేలా నిర్ణయాలు తీసుకోవడంలో భాగస్వామ్యం అయ్యారన్న అభియోగాలు నమోదు చేసింది.

లిక్కర్ స్కాం డబ్బుల మనీలాండరింగ్‌లో మిథున్‌రెడ్డి కీలక పాత్ర పోషించారన్న అంశంపై ఈడీ దృష్టి సారించినట్లు సమాచారం. స్కాం డబ్బుల సేకరణ, వాటి రూటింగ్, పైస్థాయికి లెక్కలు చేరవేయడంలో ఆయన పాత్ర ఉందన్న ఆరోపణలను ఈడీ విచారణలో వెలికితీయనుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరోవైపు, వరుసగా ఇద్దరు కీలక నేతలను విచారణకు పిలవడంతో లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తు మరింత వేడెక్కిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

This post was last modified on January 19, 2026 10:52 am

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

7 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

8 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

8 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

10 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

12 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

12 hours ago