అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు చేస్తోందని ఆరోపించారు. ఇటీవల కాలంలో తిరుమల, ఇతర దేవాలయాలకు సంబంధించిన ఘటనలు తరచూ వివాదాస్పదంగా మారాయి. గతంలో పరకామణి చోరీ, లడ్డూ నెయ్యి కల్తీ ఆరోపణలు, తాజాగా మద్యం బాటిళ్ల వ్యవహారం వంటి అంశాలు భక్తుల్లో ఆందోళనను కలిగించాయి.
ఇవన్నీ సహజ సంఘటనలేనా? లేక రాజకీయ లెక్కలతో సాగుతున్న కుట్రలేనా? అనే ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపధ్యంలో హిందూ మతంపై వైసీపీ దాడి చేస్తోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అధికారంలో ఉన్న సమయంలో దేవాలయాలపై దాడులను ప్రేరేపించడమే కాకుండా, వాటిపై చులకన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. పరకామణి చోరీ ఘటనను కూడా చిన్నపాటి దొంగతనంగా అభివర్ణించడమే జగన్ హిందూ మతంపై ఉన్న దృష్టిని స్పష్టంగా చూపుతోందని పలువురు మంత్రులు అన్నారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి శనివారం వచ్చిన చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అనంతరం పార్టీ ముఖ్యనేతలు, ఆఫీస్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ రాజకీయ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. అమరావతి రాజధానిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు.
నదీ తీరానికి, నదీ పరీవాహక ప్రాంతానికి మధ్య తేడా కూడా తెలియని వ్యక్తి రాజధానిపై అర్థం లేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సింధు నాగరికత ఎలా అభివృద్ధి చెందిందో తెలుసుకుంటే అమరావతిపై ఈ స్థాయి వ్యాఖ్యలు చేసేవారు కాదని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా నదుల వెంబడి నాగరికతలు, నగరాలు వికసించాయని ఆయన గుర్తు చేశారు.
This post was last modified on January 11, 2026 11:53 am
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…