చిత్ర నిర్మాత బండ్ల గణేశ్ మరోసారి తనదైన శైలిలో వార్తల్లో నిలిచారు. ఇటీవల దీపావళి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని తన నివాసానికి ఆహ్వానించి ప్రత్యేక వేడుక నిర్వహించిన బండ్ల గణేశ్, తాజాగా మరో కీలక ప్రకటన చేశారు.
షాద్‌నగర్ నుంచి తిరుమల వరకు ‘మహా పాదయాత్ర’ చేపట్టనున్నట్లు వెల్లడించారు. చంద్రబాబు నాయుడుపై తనకు ఉన్న అభిమానాన్ని, భక్తిని చాటుకునే భాగంగానే ఈ పాదయాత్ర చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
గతంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు అయిన సమయంలో, ఆయన ఎలాంటి మచ్చ లేకుండా విడుదల కావాలని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని బండ్ల గణేశ్ మొక్కుకున్న విషయం తెలిసిందే. ఆ కోరిక నెరవేరిన నేపథ్యంలో, ఇప్పుడు మొక్కు తీర్చుకునే కార్యక్రమంగా ఈ పాదయాత్ర నిర్వహించనున్నట్లు సమాచారం.
ఈ నెల 19వ తేదీన షాద్‌నగర్‌లోని తన స్వగృహం నుంచి పాదయాత్రను ప్రారంభించనున్న బండ్ల గణేశ్, కాలినడకన తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. బండ్ల గణేశ్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబుతో అనుబంధం ఉన్న కార్యక్రమం కావడంతో ఈ మహా పాదయాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంటోంది.
This post was last modified on January 10, 2026 6:36 pm
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…