ఏపీ మంత్రి నారా లోకేష్ మరోసారి తన మనసు చాటుకున్నారు. లోకల్‌గానే కాదు… విదేశాల్లో కూడా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే.. వెంటనే ఆయన రియాక్ట్ అవుతున్నారు. సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అనేక మందిని కువైత్, దుబాయ్ సహా ఎడారి దేశాల నుంచి తీసుకువచ్చారు.
ఆయా వ్యక్తులు.. ఏదో ఒక పనిపై అక్కడకు వెళ్లడం. . ఏజెంట్ల చేతిలో నష్టపోవడం వంటివి కామన్‌గా మారింది. కష్టాల్లో ఉన్నతమను కాపాడాలని సెల్ఫీ వీడియోలు, సమాచారం వారు లోకేష్‌కు పంచుకోవడంతో వెంటనే ఆయన రంగంలోకి దిగి వారిని సురక్షితంగా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా ఇలాంటి కష్టమే ప్రస్తుతం ట్రైనింగ్‌లో ఓ కానిస్టేబుల్‌కు ఎదురైంది. గత నెలలో జరిగిన కానిస్టేబుల్ నియామకాల్లో ఉద్యోగం సంపాయించిన సాయి అనే యువకుడు.. కువైత్‌లో తన మాతృమూర్తి పడుతున్న ఇబ్బందులను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
అక్కడ తన తల్లిని కొందరు హింసిస్తున్నారని.. ఆమెను కాపాడాలని వేడుకున్నారు. అంతేకాదు.. తనకు తల్లి తప్ప.. మరెవరూ లేరని కూడా వాపోయారు. మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకుని తన తల్లిని వెనక్కి తీసుకురావాలని కోరుకున్నారు. ఈ వీడియో పై నారా లోకేష్ ఇమ్మీడియెట్‌గా స్పందించారు.
శిక్షణలో ఉన్న కానిస్టేబుల్‌కు భరోసా ఇచ్చారు. మీ అమ్మను కాపాడేందుకు.. ఆమెను సురక్షితంగా తీసుకువచ్చేందుకు లేదా.. అక్కడే సరైన వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇప్పటికే కువైత్‌లోని తన బృందం(ఎన్నారై టీడీపీ) వివరాలు సేకరించిందని.. సంబంధిత అధికారులతో కూడా ఈ బృందంచర్చిస్తోందని తెలిపారు.
ధైర్యంగా ఉండాలని సూచించారు. తాను ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని సమీక్షిస్తానని కూడా నారా లోకేష్ సదరు కానిస్టేబుల్‌కు ధైర్యం చెప్పారు. దీంతో కానిస్టేబుల్ విన్నపాన్ని ఆయన సంబంధిత అధికారులకు.. చేరవేశారు. ఈ విషయాన్ని పరిశీలించి ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలన్నారు.
This post was last modified on January 6, 2026 9:18 pm
భయపడినంతా అయ్యింది. రాజకీయాల్లోకి వెళ్లేముందు చివరి సినిమాగా విజయ్ ప్రకటించుకున్న జన నాయకుడుకి ఇంకా అడ్డంకులు తొలగలేదు. సెన్సార్ సర్టిఫికెట్…
సంక్రాంతి పోటీలో అండర్ డాగ్ ఫీలింగ్ కలిగిస్తున్న సినిమాగా భర్త మహాశయులకు విజ్ఞప్తి మీద మెల్లగా అంచనాలు పెరిగేలా ప్రమోషనల్…
ఔను.. మీరు చదివింది నిజమే. నిత్యం ఉప్పు-నిప్పుగా ఉండే.. రెండు రాజకీయాలు.. ఒకరిపై ఒకరు దుమ్మె త్తిపోసుకునే రాజకీయ పార్టీలు..…
ఒకే వీకెండ్లో తన సినిమాకు పోటీగా వేరే సినిమా వస్తుంటే.. ఒక చిత్ర బృందంలోని ఏ వ్యక్తి అయినా తమ…
వైసీపీ శ్రేణులు బీఆర్ఎస్ విజయం కోసం, బీఆర్ఎస్ కార్యకర్తలు వైసీపీ గెలుపు కోసం కోరుకుంటున్నారని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వైసీపీ…
సినిమా పైరసీల ద్వారా గుర్తింపు పొందిన ఐబొమ్మ రవికి మరిన్ని కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం ఐదు కేసుల్లో రవి నిందితుడిగా…