ఏపీ అసెంబ్లీ స్పీకర్.. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చింతకాయల అయ్యన్న పాత్రుడి కుమారుడు.. యువ నేత, సీబీఎన్ ఆర్మీ, ఐటీడీపీలో గతంలో కీలక రోల్ పోషించిన చింతకాయల విజయ్‌కు కీలక పదవి దక్కనుందా? ఆయనను పెద్దల సభకు పంపించనున్నారా? అంటే.. తాజాగా ఔననే చర్చే టీడీపీలో సాగుతుండడం గమనార్హం. 2026, జూన్ 21న .. ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిలో సానా సతీష్ బాబు తప్ప.. మిగిలిన మూడు స్థానాలు వైసీపీ నేతలవే.(పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీ, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి) ఉన్నాయి.
అయితే..వీరిలోనూ సానా సతీష్ ఎన్నారై టీడీపీ నాయకుడు కావడంతో ఆయనకు మరోసారి రెన్యువల్ దక్కే అవకాశం ఉంది. ఇక, పరిమళ్ నత్వానీ.. అటు బీజేపీకి అనుకూలం, ఇటు ముఖేష్ అంబానీకి మిత్రుడు కావడంతో ఆయనకు కూడా.. చంద్రబాబు మరోసారి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది(బీజేపీ అడిగితే). సో.. మిగిలిన రెండు స్థానాలు మాత్రం కూటమికే దక్కనున్నాయి. వీటిలో ఒకటి చింతకాయల విజయ్‌కు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీలో యాక్టివ్ నాయకుడిగా విజయ్ పేరు తెచ్చుకున్నారు. పైగా.. సుదీర్ఘ కాలంగా కూడా ఈ ఫ్యామిలీ టీడీపీతోనే ఉంది.
గత ఎన్నికల్లోనే..
వాస్తవానికి గత ఎన్నికల్లోనే చింతకాయల విజయ్‌కు అసెంబ్లీ టికెట్ ఇస్తారన్న ప్రచారం జరిగింది. ఆయన కూడా నియోజకవర్గంలో జోరుగా పర్యటించారు. అయ్యన్న పాత్రుడు కూడా తన వారసుడిని ఎంకరేజ్ చేశారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నం నియోజకవర్గం టికెట్‌ను ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలోనే అటు యువగళం పాదయాత్రలోనూ ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గంలోనూ కీలక రోల్ పోషించారు. కానీ, గత ఎన్నికల్లో బలమైన పోటీ ఉండడంతో చంద్రబాబు మరోసారి అయ్యన్నకే అవకాశం కల్పించారు. దీంతో విజయ్ వెయిటింగ్‌లో ఉన్నారు.
ఈ క్రమంలో విజయ్‌కు తగిన పోస్టును ఇవ్వాలన్న ఆలోచన పార్టీ అధిష్టానం చేస్తోంది. దీనిలో భాగంగానే.. వచ్చే ఏడాది ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకదానిని విజయ్‌కు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే.. స్థానికంగా ఎదగాలని భావిస్తున్న విజయ్‌కు.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఖాయమన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తే.. మరింత దూకుడుగా పార్టీ కార్యక్రమాలను, నియోజకవర్గంలో అభివృద్ధిని కూడా ముందుకు తీసుకువెళ్తారన్న చర్చసాగుతోంది. ఇక, మంత్రి నారా లోకేష్ గత ఎన్నికలకు ముందు చేసిన యువగళం పాదయాత్రలో విజయ్ కీలక రోల్ పోషించారు. చంద్రబాబు దగ్గర కూడా యువ నాయకుడిగా మంచి మార్కులు వేసుకున్నారు. ఈ పరిణామాలు.. విజయ్‌కు కలిసి వస్తున్నాయని పార్టీలో అంతర్గత చర్చనడుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on December 29, 2025 10:26 pm
ఈ వారం రెండు రీ రిలీజులు వస్తున్నాయి. ఒకటి మహేష్ బాబు మురారి. రెండు పవన్ కళ్యాణ్ జల్సా. ఇవి…
ఒకప్పుడు వివిధ భాషల్లో అగ్ర కథానాయికగా కొనసాగింది తమన్నా. కానీ కొన్నేళ్లుగా ఆమె ఐటెం సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్ అయిపోయింది.…
రాజాసాబ్‌లో ప్రభాస్‌కు జోడీగా ముగ్గురు హీరోయిన్లు నటించారు. అందులో రిద్ధి కుమార్‌పై మొన్న అందరి దృష్టీ నిలిచింది. రాజాసాబ్ ప్రి…
టిల్లు స్క్వేర్ తర్వాత సిద్ధూ జొన్నలగడ్డతో సితార ఎంటర్ టైన్మెంట్స్ ప్లాన్ చేసుకున్న ప్యాన్ ఇండియా మూవీ కోహినూర్. కాన్సెప్ట్…
ఐ బొమ్మ రవి.. గత రెండు నెలలుగా మార్మోగుతున్న పేరు. కొన్నేళ్ల నుంచి తెలుగు సినిమాలను పైరసీ చేస్తూ పెద్ద…
మతపరమైన అంశాలపై వ్యాఖ్యలు మరోసారి వివాదానికి దారితీశాయి. ప్రజలు భక్తి ప్రపత్తులతో కొలుచుకునే వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆ…