Political News

జగన్ బర్త్ డే: నేతగా సఫలం.. విఫలం!

డిసెంబర్ 21 వైసీపీ అధినేత జగన్ పుట్టిన రోజు. నేటితో ఆయన 53వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకోవడం కామనే. కానీ ఒక నాయకుడిగా జగన్‌ను చూసినప్పుడు ఆయన ఎంత ఎత్తుకు ఎదిగారో, అంతే ఎత్తు నుంచి కిందికి జారిపోవడం జగన్ జీవితంలో కీలక అధ్యాయమే అని చెప్పాలి. నేతగా సఫలమైన జగన్, అదే నేతగా విఫలం కూడా అయ్యారు.

2011లో కాంగ్రెస్‌తో విభేదించినప్పుడు జగన్ వల్ల ఏమవుతుందనే అనుమానం కాంగ్రెస్ నాయకుల్లో ఉండేది. కానీ ఆ తర్వాత పరిణామాల్లో అదే కాంగ్రెస్‌ను కాదని, సొంత పార్టీ పెట్టుకుని (2011 మార్చి 12) స్వల్ప కాలంలోనే విజయం దక్కించుకున్నారు.

2014 ఎన్నికల నాటికి, అంటే కేవలం మూడేళ్లలోనే విభజిత ఏపీలో 67 అసెంబ్లీ స్థానాలు దక్కించుకుని ప్రధాన ప్రతిపక్ష హోదాను సాధించారు. అనంతరం 2019 ఎన్నికలకు ముందు సుదీర్ఘ పాదయాత్ర చేసి, అప్పటి ఎన్నికల్లో 151 స్థానాలతో కనీవినీ ఎరుగని విజయం సాధించారు. నేతగా జగన్ సక్సెస్ అయ్యారు.

అనేక మంది పార్టీలో చేరినా, అంతే సంఖ్యలో పార్టీ నుంచి బయటకు వచ్చినా, చెక్కుచెదరని పట్టుదలతో ముందుకు సాగారు. అత్యంత స్వల్ప వ్యవధిలో ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగన్, కాలం కళ్లముందు తిరగకుండానే అంతే పతనం అయ్యారు.

2019–24 మధ్య ఆయన పాలనలో మంచి పనులు చేయలేదా అంటే చేశారన్నది ప్రత్యర్థులు సైతం అంగీకరించిన విషయం. అయితే రాజకీయ కక్ష సాధింపు, ఆశ్రిత పక్షపాతం, కుల రాజకీయాలు, పెంకితనం కలిసి జగన్‌లోని నాయకత్వ లక్షణాలను దెబ్బతీశాయి. ఇది ఆయన కోరి తెచ్చుకున్న పరాజయమని పరిశీలకులు అంటున్నారు.

అధికారంలో లేనప్పుడు ఒకలా, ఉన్నప్పుడు మరోలా వ్యవహరించిన జగన్ ప్రజలకు దూరమయ్యారు. ఫలితంగా 2024లో ఊహించని విధంగా 11 స్థానాలకు పరిమితమయ్యారు. ఈ పరాభవం నుంచి పాఠాలు నేర్చుకునే ప్రయత్నంలో జగన్ ఇప్పటికీ తడబడుతున్నారన్నది కీలక విశ్లేషణ.

భవిష్యత్తుపై ఆశలు

భవిష్యత్తుపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్న జగన్, దానికి అనుగుణంగా తన పంథాను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మంకు పట్టుదల కొన్ని సందర్భాల్లో కలిసి వచ్చినా, అదే ప్రధాన ఇబ్బందిగా మారుతోంది.

ప్రధాన ప్రతిపక్ష హోదా లేదన్న కారణంతో అసెంబ్లీకి దూరంగా ఉండటం, నాయకుల విషయంలో మొండిగా వ్యవహరించడం, కీలకమైన రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసుకోవడం వంటి అంశాలు ప్రధాన అవరోధాలుగా మారాయి.

నాయకుడిగా ఒకప్పుడు సఫలమైన జగన్, తన నాయకత్వ లక్షణాలకు పదును పెట్టుకుని, పరిస్థితిని అర్థం చేసుకుని రాజకీయాలు చేయకపోతే, విఫలమైన బాటలోనే నడవాల్సి వస్తుందన్న నిష్టూర సత్యాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది.

This post was last modified on December 22, 2025 10:25 am

Share

Recent Posts

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

1 hour ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

1 hour ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

3 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

4 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

5 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

5 hours ago