పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పొటెన్షియాలిటీకి తగిన సినిమాలు చేయట్లేదని.. సరైన కథలు ఎంచుకోవట్లేదని.. ట్రెండీ డైరెక్టర్లతో జట్టు కట్టట్లేదని చాలా ఏళ్ల పాటు అభిమానులు ఫీలవుతూ వచ్చారు. ఐతే ‘ఓజీ’ అనే ఒక్క సినిమాతో వారి కోరికలన్నీ తీర్చేశాడు పవన్. అది ఆయన పొటెన్షియాలిటీని బాగా వాడుకున్న సినిమా. కథ బాగా కుదిరింది. సుజీత్ లాంటి ట్రెండీ డైరెక్టర్ ఆయన్ని అభిమానులు కోరుకునేలా చూపించాడు.
తాజాగా ఒక డైరెక్టర్స్ రౌండ్ టేబుల్లో పాల్గొన్న సుజీత్.. ‘ఓజీ’ తెర వెనుక విశేషాలను పంచుకున్నారు. ఈ సినిమాలో అభిమానులను ఉర్రూతలూగించిన అనేక షాట్లు ఉన్నాయి. అందులో ఒకటి కెమెరా రివర్స్‌లో పెట్టి నీటి ప్రతిబింబం నుంచి పవన్‌ను చూపించే షాట్ ఒకటి ఉంటుంది. అది తెర మీద భలేగా అనిపించింది.
ఐతే ఇలాంటి షాట్ తాను ఫీచర్ ఫిలిం డైరెక్టర్ కాకముందే తీసినట్లు సుజీత్ తెలిపాడు. షార్ట్ ఫిలిం తీసే రోజుల్లోనే ఆ షాట్ తీసినట్లు చెప్పాడు. ఐతే ఆ షాట్ ఉన్న షార్ట్ ఫిలింను ఎవ్వరూ పట్టించుకోలేదని.. ఇప్పటికీ దానికి యూట్యూబ్‌లో వంద పైచిలుకు వ్యూస్ మాత్రమే ఉన్నాయని.. కానీ ఇదే షాట్ ‘ఓజీ’ సినిమాలో పెడితే ఆహా ఓహో అంటూ కొనియాడారని, ఫ్యాన్స్ ఊగిపోయారని సుజీత్ చెప్పాడు.
ఇక ఈ సినిమాలో పవన్ ఇంట్రో సీన్ గురించి కూడా సుజీత్ స్పందించాడు. కటానా పట్టుకుని విధ్వంసం సృష్టిస్తూ సాగే ఆ సన్నివేశాన్ని ఆ శైలిలో ఏ హీరోను పెట్టి తీసినా, మంచి బీజీఎం తోడైతే బాగానే ఉంటుందని.. కానీ ఆ సీన్లో పవన్ నటించడం వల్ల దాని ఎఫెక్ట్ వంద రెట్లు పెరిగిందని సుజీత్ తెలిపాడు.
ఇక ‘ఓజీ’ సినిమా షూట్‌కు వెళ్లడానికి ముందే తన దగ్గర ఈ చిత్రానికి సంబంధించి రెండున్నర గంటల ఫుటేజ్ ఉన్నట్లు సుజీత్ వెల్లడించాడు. పవన్ చాలా బిజీ కాబట్టి.. పక్కా ప్లానింగ్‌తో అడుగులు వేయాల్సి వచ్చిందని.. అందుకే తన స్నేహితులను పెట్టి మొత్తం సినిమాలోని సన్నివేశాలను షూట్ చేసి ఆ ఫుటేజ్ పక్కన పెట్టుకున్నానని.. అందువల్ల శరవేగంగా ఈ సినిమాను పూర్తి చేయగలిగానని సుజీత్ తెలిపాడు.
This post was last modified on December 21, 2025 1:00 pm
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…
2024 ఎన్నికల ఫలితాలపై ఈవీఎంల పనితీరుపై వైసీపీ నేతలు కొందరు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈవీఎంల వల్లే…
స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70% స్థానిక…
రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…
పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…
సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…