Political News

జ‌గ‌న్‌ నిర్ణ‌యానికి చెక్‌, వారికి చంద్ర‌బాబు చ‌ల్ల‌ని క‌బురు!

గ‌త రెండు మూడేళ్ల నుంచి ఎదురు చూస్తున్న వేలాది మందికి సీఎం చంద్ర‌బాబు తాజాగా చ‌ల్ల‌ని క‌బురు అందించారు. త‌మ భూముల‌ను వైసీపీ హ‌యాంలో `ఏ-22`లో చేర్చ‌డంతో వాటిపై హ‌క్కులు కోల్పోయిన వేలాది మందికి ఉప‌శ‌మ‌నం క‌ల్పిస్తూ.. తాజాగా నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయా భూముల‌ను ప‌రిశీలించి.. వాటిని `ఏ-22` జాబితా నుంచి తొల‌గించాల‌ని ఆదేశించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వేల మందికి ల‌బ్ధి చూకూర‌డంతోపాటు.. ఇన్నాళ్లుగా వారి ఆవేద‌న కూడా తీరిపోనుంది.

ఏంటీ `ఏ-22`

జ‌గ‌న్ పాల‌నాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 5.74 ల‌క్ష‌ల ఎక‌రాల అసైన్డ్ భూముల‌ను ఏ-22లో చేర్చారు. త‌ద్వారా ఆయా భూములు క‌లిగిన వారికి ఎలాంటి హ‌క్కులు లేక‌పోగా, ప్ర‌భుత్వానికి వారు వివ‌ర‌ణ ఇవ్వాల్సి వ‌చ్చింది. దీనిపై అప్ప‌ట్లోనే పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు, వివాదాలు వ‌చ్చాయి. అంతేకాదు.. వైసీపీ నాయ‌కులు కొంద‌రు ఈ భూముల‌పై క‌న్నేశార‌ని.. వాటిని స్వాధీనం కూడా చేసుకున్నార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌ల‌కు ముందు ఈ వ్య‌వ‌హారం కూడా వివాదంగా మారింది.

తాజాగా ఈ 5.74 ల‌క్ష‌ల ఎక‌రాల భూముల‌పై దృష్టి పెట్టిన సీఎం చంద్ర‌బాబు.. ఆయా భూముల వివ‌రాల‌ను మ‌రోసారి ప‌రిశీలించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. “ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున ఈ భూముల‌పై విన్న‌పాలు వ‌చ్చాయి. స్వ‌యంగా నేను కూడా విన్నాను. ప్ర‌జ‌లు తీవ్ర ఆవేద‌న‌తో ఉన్నారు. ఫ్రీహోల్డ్‌లో ఉంచిన అసైన్డ్ భూముల‌ను.. రిస‌ర్వే చేసి.. ఆయా య‌జ‌మానుల‌కు అనుకూలంగా నిర్ణ‌యం తీసుకోండి.“ అని చంద్ర‌బాబు ఆదేశించారు. గతేడాది జూన్ 15 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు 5.28 ల‌క్ష‌ల ఫిర్యాదులు కేవ‌లం ఏ-22పైనే రావ‌డం గ‌మ‌నార్హ‌మ‌ని కూడా సీఎం అన్నారు.

దీంతో మాజీ సైనికోద్యోగులు, వైసీపీ హ‌యాంలో క‌క్ష‌పూరితంగా భూములు లాక్కున్న వారికి తాజాగా న్యాయం జ‌ర‌గ‌నుంది. అదేవిధంగా ఆరు వేల‌కు పైగా గ్రామాల్లో రీస‌ర్వే చేసి.. త‌ప్పులు లేకుండా ఆయారికార్డుల‌ను అప్ గ్రేడ్ చేయాల‌ని కూడా సీఎం చంద్ర‌బాబు ఆదేశించారు. తాజా నిర్ణ‌యాల‌తో వేలాది మందికి మేలు జ‌ర‌గ‌నుంది.

This post was last modified on December 10, 2025 8:42 am

Share
Show comments
Published by
Kumar
Tags: Chandrababu

Recent Posts

లేడీ డైరెక్టర్ వేసిన డేరింగ్ స్టెప్

టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…

24 minutes ago

ఎవరెస్ట్ బరువు మోస్తున్న మారుతీ సాబ్

ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…

1 hour ago

రవితేజ వారి ‘మంచు’ పంచ్ చూశారా?

ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు…

2 hours ago

సినిమా వాయిదా… 60 కోట్ల రీఫండ్

అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…

2 hours ago

తిరుమలపై ఎందుకీ పగ..?

తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…

3 hours ago

ది వీక్ కవర్ పేజీపై లోకేష్.. చీఫ్ జాబ్ క్రియేటర్

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణానికి దిశానిర్దేశం చేస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ‘ది వీక్’ మ్యాగజైన్ కవర్…

3 hours ago