తమ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచి పనుల గురించి వివరించడంలో చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారు. ఏపీ పునర్నిర్మాణానికి తమ ప్రభుత్వం నిరంతరంగా శ్రమిస్తుందని చెబుతుంటారు. చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు, ఏపీ అభివృద్ధికి దోహదపడేలా ఉంటాయని కూటమి లోని ప్రతి ఒక్క నేత చెబుతున్న మాట. ఇదే సమయంలో ఆయన విపక్ష కుట్రలపై కూడా కఠినంగా వ్యవహరిస్తుంటారని రాజకీయ వర్గాల్లో ఓ భావన ఉంది.
రాజధాని అభివృద్ధికి అడ్డుపడే ఏ శక్తిని కూడా ఉపేక్షించేది లేదంటూ ఆయన మొదటి నుంచీ హెచ్చరించడం ఇందుకు ఉదాహరణ. నిన్నటి ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు వైసీపీపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. అది అసలు తల తోక లేని పార్టీ అంటూ నిప్పులు చెరిగారు. వారు తప్పులు చేయడమే కాకుండా.. తప్పులు చేసే వాళ్ళని కూడా సమర్థించే నాయకులు వైసీపీలో ఉన్నారని దుయ్యబట్టారు.
ఏపీలో ఇప్పుడు సంచలనం రేకెత్తించిన పరకామణి చోరీ అంశంపై వైసీపీని విమర్శించారు. దానిని జగన్ చిన్న నేరం అనడం ఏంటంటూ మరోసారి ప్రశ్నించారు. దేవుడి దగ్గర సొమ్మును చోరీ చేస్తే దానిని సమర్ధిస్తారా..? కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి ఆలయంలోనే చోరీ జరిగితే అది చిన్నదని ఎలా అంటారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదే క్రమంలో తాము నేరం చేసిన వారిపై ఎంత కఠినంగా వ్యవహరిస్తామో కూడా చెప్పారు. ఇటీవల ఓ దేవాలయంలో ఈవో చోరీ చేస్తే తక్షణం సస్పెండ్ చేశాం, అరెస్ట్ చేయించామని ఆయన గుర్తు చేశారు.
తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి ఘటనపై చంద్రబాబు మరోసారి స్పందించారు. శ్రీవారి ఆలయంలో గతంలో నాసిరకం ప్రసాదాన్ని భక్తులకు ఇస్తే దానినీ సమర్ధించారంటూ వైసీపీపై నిప్పులు చెరిగారు. కల్తీ నెయ్యి స్వామివారి ప్రసాదం తయారీకి సరఫరా చేసిన ఘటనను వెనకేసుకొస్తారా..? అని సీఎం ప్రశ్నించారు. మొత్తం మీద ఇలాంటి వారితో రాజకీయం చేయడానికి తనకు సిగ్గు అనిపిస్తోందన్నారు.
రాజకీయ ముసుగులో నేరాలు చేసిన వ్యక్తుల పై కఠినంగా వ్యవహరిస్తాని ఆయన హెచ్చరించారు. జగన్ కారు కింద పడి మృతి చెందిన సింగయ్య కేసును, రోడ్డు ప్రమాదంలో పాస్టర్ మరణించిన కేసులో ఆయన ప్రస్తుతించారు. ఇటువంటి అంశాల్లో తమ ప్రభుత్వంపై బుదర జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఇటువంటి వాటిని ఉపేక్షించే లేదంటూ సీఎం ఘాటుగానే చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates