అధికారంలోకి రాకముందు.. ప్రజల మధ్య ఉండే పార్టీల గురించి తెలుసు. కానీ, అధికారం వచ్చిన తర్వాత కూడా నిరంతరం ప్రజలను అంటిపెట్టుకుని ఉంటున్న పార్టీ ఏదైనా ఉంటే.. అది టీడీపీనే అని చెప్పారు. గత 17 మాసాల్లో ప్రతి నెలా ప్రజలను పలకరిస్తూనే ఉన్నారు సీఎం చంద్రబాబు అంతేకాదు.. ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువ అవుతూనే ఉన్నారు. తాజాగా.. సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతన్న మీకోసం కార్యక్రమం ముగిసింది.
వాస్తవానికి ఈ 17 మాసాల్లో చంద్రబాబు కీలకమైన అనేక కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ప్రతి కార్యక్రమం కూడా ప్రజల వద్దకు వెళ్లేదే. ప్రజలను కలుసుకోవడంతోపాటు ప్రభుత్వ ప్రాధాన్యాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇలా అనేక అంశాలను ప్రజలకు వివరించే అవకాశం ఉన్న కార్యక్రమాలు కావడం విశేషం. వీటిలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్, సూపర్ సిక్స్ సూపర్ హిట్, అదే విధంగా స్త్రీ శక్తి… ఇలా అనేక కార్యక్రమాలు సీఎం చంద్రబాబు పక్కా ప్రణాళికతో అమలు చేశారు.
ఈ ప్రతి కార్యక్రమం లక్ష్యం నాయకులు ప్రజలను కలుసుకోవడం వారి సమస్యలు తెలుసుకోవడం. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వారికి వివరించడం ద్వారా ప్రభుత్వం పై పాజిటివిటీని పెంచాలి అన్నది సీఎం చంద్రబాబు ఉద్దేశం. అయితే ఈ విషయంలో ఎంతమంది పాల్గొంటున్నారు ఎంతమంది వెనకంజ వేస్తున్నారు అనే అంశాలపై కూడా పక్కా లెక్కలు తీస్తున్నారు. ఇది ఇట్లా ఉంటే తాజాగా రైతన్న మీకోసం కార్యక్రమం ఇటీవల చేపట్టారు. వ్యవసాయ రంగంలో సాంకేతికతకు పెద్దపేట వేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు.
దీనిలో భాగంగా ఎమ్మెల్యేలు అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులు ప్రతి గ్రామంలోనూ రైతులను చేరుకొని వారి ఇంటికి వెళ్లి వారికి అధునాతన వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించడంతోపాటు సాగులో సాంకేతికతను ఏ విధంగా వినియోగించాలి డ్రోన్ వ్యవస్థను ఎలా అందుకొచ్చుకోవాలి అనే పలు అంశాలపై శిక్షణ ఇవ్వాలి. ఇదీ రైతన్న మీకోసం కార్యక్రమం ప్రధాన లక్ష్యం. అయితే దీనిలో కనీసం 30% మంది ఎమ్మెల్యేలు కూడా పార్టిసిపేట్ చేయలేదన్నది తాజాగా ప్రభుత్వానికి అదేవిధంగా పార్టీకి అందిన కీలక సమాచారం. ఎమ్మెల్యేల పార్టిసిపేషన్ అయితే అక్కడ కనిపించలేదు. దీనిపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ప్రజలను కలుసుకునే విషయంలో ఆయన మరోసారి దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది.
This post was last modified on December 3, 2025 3:59 pm
కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…
రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…
బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…