హైదరాబాద్ సిటీ శివారు కోకాపేటలో భూముల ధరలు సరి కొత్త రికార్డులను సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ భూములను కొనుగోలు చేసేందుకు తెలుగు రాష్ట్రాల వారే కాకుండా ఇతర రాష్ట్రాల వారు సైతం పోటీ పడుతుండడం ఆసక్తికరంగా మారింది. గత వారం రెండు దఫాలుగా నాలుగు ప్లాట్లను హెచ్‌ఎండీఏ వేలం వేయగా, ఐదు ఎకరాల స్థలాన్ని ఎకరాకు రూ.151కోట్ల చొప్పున నలుగురు వ్యక్తులు దక్కించుకున్నారు. ఇది ఇరు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.
దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గోపీనాథపట్నంలో పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ కోకాపేట భూముల ధరల అంశం ప్రస్తావించారు.
‘హైదరాబాద్ లో చేసిన అభివృద్ధి ఫలాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కోకాపేటలో ఎకరా రూ.10 వేలు ఉంటే నేడు రూ.160 కోట్ల వరకూ వెళ్లింది. అభివృద్ది జరిగితే భూముల ధరలు పెరుగుతాయి..’ అని ఆయన స్పష్టం చేశారు. కియా కార్ల పరిశ్రమ రాకతో అనంతపురం పెనుగొండ ప్రాంతంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అక్కడ ఎకరం రూ.10 లక్షలు ఉండే భూమి ఇప్పుడు కోట్లలో పలుకుతోందన్నారు.
అదే విధంగా 2027 నాటికి గోదావరి పుష్కరాలకంటే ముందే పోలవరం పూర్తిచేసి జాతికి అంకితం చేస్తాం అన్నారు. పోలవరం పూర్తయితే నీటి ఎద్దడి ఉండదు. పొలాలకు రేట్లు పెరుగుతాయి అని తెలిపారు. ఏపీ అభివృద్ధి లక్ష్యంగా మూడు ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేస్తున్నాం. అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి. 2028 నాటికి అమరావతి ఫేజ్ 1 పనులు పూర్తవుతాయి. ప్రపంచంలోనే సుందర నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతాం. తిరుపతిని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
This post was last modified on December 2, 2025 7:31 am
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…