Political News

కేసీఆర్ చెబితేనే… ఫోన్ ట్యాప్ విచారణలో కీలకాంశం వెలుగులోకి!

ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన విచారణ సిట్ చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో పలువురిని విచారించి.. వారి వాంగ్మూలాల్ని రికార్డు చేస్తున్న అధికారులు.. తాజాగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఓఎస్డీగా వ్యవహరించిన రాజశేఖర్ రెడ్డిని తాజాగా విచారించి..వాంగ్మూలాన్నిరికార్డు చేశారు. దాదాపు రెండు గంటల పాటు విచారణ సాగింది.

ఈ సందర్భంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ గా వ్యవహరిస్తున్న ప్రభాకర్ రావు 2020 జూన్ 30న ఉద్యోగ విరమణ పొందగా..అదే రోజు ఆయన్ను మూడేళ్లు కంటిన్యూ చేస్తున్నట్లుగా ఉత్తర్వులు ఎలా ఇచ్చారు? అని ప్రశ్నించారు. ఆ గడువు ముగిసిన తర్వాత కూడా మరోరెండేళ్లు ఆయన్ను సర్వీసులో కంటిన్యూ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయటాన్ని ప్రశ్నిస్తూ.. ‘రెండోసారి ప్రభాకర్ రావునుకంటిన్యూ చేయాలని ప్రభుత్వ సాధారణ పరిపాలనా విభాగానికి సూచన చేయాల్సిన అవసరమేంటి?’ అన్న కోణంలో సిట్ విచారణ చేయగా..

అప్పటి సీఎంగా వ్యవహరిస్తున్న కేసీఆర్.. ప్రభాకర్ రావు రిటైర్మెంట్ కావటానికి వారం ముందే తనకు చెప్పటంతో ఆయన్ను అపాయింట్ చేసినట్లుగా పేర్కొన్నారు.
సీఎంగా ఉన్న కేసీఆర్ తనకు ఆదేశాలు జారీ చేయటంతో ఆయన్ను కంటిన్యూ చేయాలని జీఏడీ అధికారులకు సూచన చేశానని.. రాజశేఖర్ రెడ్డి సిట్ కు వాంగ్మూలం ఇచ్చినట్లుగా తెలిసింది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మరో నిందితుడిగా ఉన్న రిటైర్డ్ డీసీపీ రాధాకిషన్ రావును గతంలో విచారించిన సమయంలోనూ కేసీఆర్ పేరు ప్రస్తావన వచ్చింది. తాజాగా రాజశేఖర్ రెడ్డి విచారణలోనూ కేసీఆర్ పేరు రావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

This post was last modified on November 28, 2025 3:17 pm

Share
Show comments
Published by
Kumar
Tags: KCR

Recent Posts

మైలేజ్ సరిపోలేదు మోగ్లీ

యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల వారసుడు రోషన్ కనకాల నటించిన మోగ్లీకి ఎదురీత తప్పడం లేదు. అఖండ తాండవం…

8 hours ago

అవతార్ క్రేజ్ పెరిగిందా తగ్గిందా

ఇంకో అయిదు రోజుల్లో అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ విడుదల కాబోతోంది. మాములుగా అయితే ఈపాటికి అడ్వాన్స్ ఫీవర్…

9 hours ago

వైసీపీకి ఆ 40 % నిల‌బ‌డుతుందా.. !

40 % ఓటు బ్యాంకు గత ఎన్నికల్లో వచ్చిందని చెబుతున్న వైసిపికి అదే ఓటు బ్యాంకు నిలబడుతుందా లేదా అన్నది…

9 hours ago

సంక్రాంతి సినిమాలకు కొత్త సంకటం

ఇంకో ఇరవై నాలుగు రోజుల్లో సంక్రాంతి హడావిడి మొదలైపోతుంది. ఒకటి రెండు కాదు స్ట్రెయిట్, డబ్బింగ్ కలిపి ఈసారి ఏకంగా…

10 hours ago

తమన్ చెప్పింది రైటే… కానీ కాదు

అఖండ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో తమన్ మాటలు చర్చకు దారి తీస్తున్నాయి. ఇండస్ట్రీలో యూనిటీ లేదని,…

11 hours ago

అలియా సినిమాకు అడ్వాన్స్ ట్రోలింగ్

ఎవరో జ్వాలలు రగిలించారు, వేరెవరో దానికి బలి అయ్యారు అంటూ ఒక పాత పాట ఉంటుంది. ఎన్ని తరాలు మారినా…

12 hours ago