Political News

మోడీకి భారీ సెగ‌.. అనాలోచిత నిర్ణ‌యాలే కార‌ణ‌మా?

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం అంత‌ర్మ‌థ‌నంలో ప‌డిందా? ఇప్ప‌టి వ‌ర‌కు తాము ఏం చేసినా.. తిరుగులేద‌ని, ఏ నిర్ణ‌యం తీసుకున్నా.. వెనుక‌డుగు వేసేది లేద‌ని.. భీష్మిస్తూ వ‌చ్చిన ప్ర‌ధాని మోడీ.. ఇప్పుడు తాను తీసుకున్న నిర్ణ‌యాల‌పై పున‌రాలోచ‌న‌లో ప‌డ్డారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన మూడు కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై దేశ‌వ్యాప్తంగా రైతాంగం ఆందోళ‌న బాట ప‌ట్టింది. ప్ర‌ధానంగా ఉత్త‌రాది రాష్ట్రాల్లో ప్రారంభ‌మైన ఈ ఆందోళ‌న‌లు ఇప్పుడు దేశం న‌లుమూల‌ల‌కు విస్త‌రించాయి.

దీంతో ఏనాడూ.. దేశంలో ఏ ఆందోళ‌న‌ను ప‌ట్టించుకోని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆయ‌న స‌ర్కారు.. కూడా రైతు ఉద్య‌మంపై ఉలిక్కి ప‌డింది. ఇప్ప‌టికే ఢిల్లీని చుట్టుముట్టిన రైతాంగం.. ప్ర‌భుత్వం తాను తీసుకువ ‌చ్చిన ప్ర‌త్యేక వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుని తీరాల్సిందేన‌ని పట్టుబ‌ట్ట‌డం, ప్ర‌ముఖులు త‌మ‌కు దేశం త‌ర‌ఫున ల‌భించిన ప‌ద్మ అవార్డుల‌ను వెన‌క్కి ఇచ్చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం, ఇప్ప‌టికే కొంద‌రు వెన‌క్కి ఇచ్చేయ‌డం, వంటి ప‌రిణామాల‌తో మోడీ ఆయా చ‌ట్టాల‌పై పునాలోచ‌నలో ప‌డ్డార‌ని అంటున్నాయి ఢిల్లీ రాజ‌కీయ వ‌ర్గాలు.

వాస్త‌వానికి ప్ర‌ధాని మోడీ త‌న పాల‌న‌లో అనేక కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. వీటిలో నోట్ల ర‌ద్దు వంటి సంచ‌ల‌న నిర్ణ‌యం కూడా ఉంది. అదేవిధంగా జీఎస్టీ అమ‌లు వంటి ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను కీల‌క మ‌లుపుతిప్పిన ప‌రిణామం కూడా ఉంది. ఆయా చ‌ట్టాలు తీసుకువ‌చ్చిన‌ప్పుడు కూడా భారీ ఎత్తున దేశ‌వ్యాప్తంగా అనేక ఉద్య‌మాలు వ‌చ్చాయి. ప‌సుపు రైతులు ఉద్య‌మం, కావేరీ నీళ్ల కోసం క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు రైతులు ఉద్య‌మాలు చేయ‌డం, చెరుకు మ‌ద్ద‌తు ధ‌ర కోసం.. ఉత్త‌రాది రాష్ట్రాల రైతులు రోడ్డెక్క‌డం వంటివి మోడీకి కొత్త‌కాదు. అయితే.. ఏ నాడూ ఆయ‌న వాటిపైనా.. తాను తీసుకున్న నిర్ణ‌యాల‌పైనా స‌మీక్ష చేయ‌లేదు.

త‌ను తీసుకున్న నిర్ణ‌య‌మే ఫైన‌ల్ అని.. దానికే క‌ట్టుబ‌డాల‌ని మోడీ.. చెప్ప‌క‌నే చెప్పారు. కానీ, ఇప్పుడు కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై రోడ్డెక్కిన రైతాంగం విష‌యంలో మాత్రం ఒకింత పున‌రాలోచ‌న చేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు ద‌ఫాలుగా వ్య‌వ‌సాయ మంత్రి తోమ‌ర్ రైతుల ప్ర‌తినిధుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. మ‌ద్ద‌తు ధ‌ర‌కు ఎలాంటి భంగం క‌లుగ‌కుండా చూస్తామ‌న్నారు. అయిన‌ప్ప‌టికీ.. రైతులు స‌ద‌రు చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. దీంతో ఏకంగా ప్ర‌ధాని మోడీ.. ఆయా చ‌ట్టాల‌పై పునః స‌మీక్ష చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం.

ఇదిలావుంటే.. ఇప్పుడు ఎదురైన అనుభ‌వంతో మోడీ తీరు మారే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారుప‌రిశీల‌కులు. ఎవ‌రినీ సంప్ర‌దించ‌కుండా.. కేవలం కొంద‌రి సూచ‌న‌ల‌ను స‌ల‌హాల‌తోనే ఆయ‌న గ‌తంలో అనేక చ‌ట్టాలు తెచ్చార‌ని.. అయితే.. ఇప్పుడు మాత్రం.. రైతుల ఉద్య‌మం నేర్పుతున్న పాఠంతో భ‌విష్య‌త్తులో ఏదైనా కీల‌క చ‌ట్టం చేయాల్సి వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌జాభిప్రాయానికి ప్రాధ‌న్యం ఇవ్వ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి మోడీ తీరు మారుతుందో లేదో చూడాలి.

This post was last modified on December 5, 2020 10:26 am

Share

Recent Posts

లీక్ చెయ్యడానికి అదేమైనా ఆ టైపు సినిమానా?

ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…

44 minutes ago

తారక్ కోపం వంద శాతం సమర్ధనీయం

ఏఐ దుర్వినియోగమవుతున్న తీరు చూస్తుంటే టెక్నాలజీ తాలూకు పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపిస్తుంది. రోబోలో ఒక యంత్రం హీరోయిన్…

50 minutes ago

ఫ్యాన్ బుగ్గ గిల్లుడు… షాక్ అయిన హీరోయిన్

ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…

2 hours ago

‘ఏకం’తో లోకల్ వార్ లోకి కేకే సర్వే కిరణ్!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు…

2 hours ago

సరిహద్దులు దాటిన పీఓకే బాలిక.. తిరిగి వెళుతుందా?

భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…

3 hours ago

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

5 hours ago