ఏజెన్సీలో కాల్పుల మోత.. మరో భారీ ఎన్ కౌంటర్?

ఏజెన్సీలో ఇవాళ ఉదయం మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మారేడుమల్లి పరిధిలోని బీఎం వలసలో ఉదయం నుంచి ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్ కౌంటర్ మృతుల్లో అగ్ర నేతలు ఉన్నట్లు సమాచారం. ఎన్ కౌంటర్ ను ఇంటిలిజెన్స్ ఏడిజి మహేష్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. పూర్తి వివరాలు అందాల్సి ఉందని తెలిపారు.

నిన్న 19 మంది తప్పించుకున్నారని పోలీసులు వెల్లడించారు. తప్పించుకున్న వారి కోసం కూంబింగ్ కొనసాగుతుందన్నారు. నిన్నటి ఎన్ కౌంటర్ లో హిడ్మా సహా ఆరుగురు మావోయిస్టు చనిపోయిన సంగతి తెలిసిందే. ఇవాల్టి ఎన్ కౌంటర్ లో ముగ్గురు మహిళలు ఉన్నారు.

జోగారావు టెక్ శంకర్ మృతి చెందినట్లు ధృవీకరించారు. ఏవోబీ సీసియం టెక్ శంకర్ స్వస్థలం శ్రీకాకుళం జిల్లా. మిగిలిన వారి పేరు తెలియాల్సిన ఉందని వెల్లడించారు. అయితే మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు అజాద్, దేవ్‌జీ ఉన్నట్లు తెలుస్తోంది.