Political News

ఏపీలో పెట్టుబ‌డులు-ఒప్పందాలు… ఆ సంద‌డే వేరు!

ఏపీలో వ‌రుస పెట్టుబ‌డులు.. అదే లైన్‌లో ఒప్పందాల జోరు పుంజుకుంది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వంలో నూత‌న సంద‌డి నెల‌కొంది. గురువారం కీల‌క కంపెనీ రెన్యూ ఎన‌ర్జీ సంస్థ 82 వేల కోట్ల రూపాయ‌ల విలువైన ప్రాజెక్టుల‌ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం చంద్ర‌బాబు స‌మ‌క్షంలో విశాఖ‌లో ఈ ఒప్పందం కుదిరింది. ఇక‌, ఈ నెల‌లోనే గూగుల్ సంస్థ కూడా ఒప్పందం కుదుర్చుకుంటోంద‌ని మంత్రి నారా లోకేష్ త‌న ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

అంతేకాదు.. విశాఖలోని ఎండాడ ప్రాంతంలో వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్‌కు గురువారం నారా లోకేష్ భూమి పూజ చేశారు. ఇది మ‌రో ప్రాజెక్టు అని తెలిపారు. దీనివల్ల త‌క్ష‌ణ‌మే 2 వేల మందికి ఉద్యోగ‌, ఉపాధులు ల‌భించ‌నున్నాయ‌ని వివ‌రించారు. ఈ వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్ ద్వారా విశాఖ‌కు 3800 కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డులు రానున్న‌ట్టు నారా లోకేష్ వెల్ల‌డించారు. అన‌కాప‌ల్లిలో త్వ‌ర‌లోనే ఆర్సెల్ లార్ మిట్ట‌ల్ కంపెనీ రానుంద‌ని తెలిపారు. ఇన్పోసిస్ సంస్థ కూడా త్వ‌ర‌లోనే కార్య‌క్ర‌మాలు ప్రారంభించ‌నున్న‌ట్టు చెప్పారు.

ఇక‌, కొంద‌రు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు నారా లోకేష్ త‌న‌దైన శైలిలో జ‌వాబు చెప్పారు. అభివృద్ధిని ఒక ప్రాంతానికే ప‌రిమితం చేస్తున్నామ‌న్న వాద‌న స‌రికాద‌న్నారు. అంద‌రూ ఆలోచ‌న చేయాల‌న్నారు. నెల్లూరు ఏసీలు త‌యారు చేసే ప్రాజెక్టును తీసుకువ‌చ్చామ‌న్నారు. క‌డ‌ప‌లో  సిమెంటు ఫ్యాక్ట‌రీ రానుంద‌న్న ఆయన ప్ర‌కాశంలోనూ అనేక ప్రాజెక్టులు నెల‌కొల్పుతున్న‌ట్టు వివ‌రించారు. కియా ద్వారా తిరుప‌తిలో భారీ ఇమేజ్ పెరిగింద‌ని వివ‌రించారు.

ఈ నెల 14, 15 తేదీల్లో  నిర్వ‌హించే పెట్టుబ‌డుల స‌ద‌స్సు ద్వారా రాష్ట్రానికి మ‌రిన్ని ప్రాజెక్టులు రానున్నాయ‌ని.. వాటిని ద‌శ‌ల వారీగా అన్ని ప్రాంతాల‌కూ విస్త‌రిస్తున్న‌ట్టు మంత్రి వివ‌రించారు. కొంద‌రు చేస్తున్న విష ప్ర‌చారాన్ని న‌మ్మొద్ద‌ని ఈ సంద‌ర్భంగా నారా లోకేష్ పిలుపునిచ్చారు. కేవ‌లం 17 మాసాల్లోనే 15 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చేలా చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని వివ‌రించారు.

This post was last modified on November 13, 2025 8:54 pm

Share

Recent Posts

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

2 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

3 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

3 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

11 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

13 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

13 hours ago