ఎర్రచందనం స్మగ్లర్లకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. తిరుపతి జిల్లా మంగళంలో ఉన్న అటవీశాఖ ఎర్రచందనం గోడౌన్ ను ఈరోజు ఆయన సందర్శించారు. అక్కడ ఉన్న 8 గోడౌన్లో నిల్వ చేసిన ఎర్రచందనం లాట్ల వివరాలను తెలుసుకున్నారు. ఎ, బి, సీ మరియు నాన్‌గ్రేడ్‌ల వారీగా దుంగల వివరాలు తెలుసుకొని రికార్డులు పరిశీలించారు. ప్రతి గోడౌన్లో రికార్డులను పరిశీలించిన అనంతరం, ప్రతి ఎర్రచందనం దుంగకు ప్రత్యేక బార్‌కోడ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. పట్టుబడిన నాటి నుండి విక్రయమయ్యే వరకు ఒక్క దుంగ కూడా మిస్ అవ్వకుండా కఠినమైన పర్యవేక్షణ ఉండాలని తెలిపారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో దాదాపు 10 వేల కోట్ల విలువైన ఎర్ర చందనం అక్రమ రవాణా అయిందన్నారు. తాను బాధ్యతలు తీసుకున్న తరవాత కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడితే దాదాపు 140 కోట్ల రూపాయల విలువైన ఎర్ర చందనం వాళ్ళు పట్టుకున్నారని తెలిసింది అన్నారు. కనీసం మళ్ళీ అది మన రాష్ట్రానికి తిరిగిరాకపోగా వారికి ఆదాయం వచ్చిన విషయం చెప్పారని తెలిపారు. తాను అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజు నుండి ఎర్ర చందనం అక్రమ రవాణా అంశంపై సమీక్షలు జరుపుతూ, అక్రమ రవాణా అడ్డుకునేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నాం అన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామని, ఈ వ్యవహారంలో ఇప్పటికే నలుగురు కింగ్‌పిన్‌లను గుర్తించామని తెలిపారు.
తొలుత తిరుపతి జిల్లా, మామండూరు అటవీ ప్రాంతాన్ని పవన్ పరిశీలించారు. అడవిలో నాలుగు కిలోమీటర్లు పైగా ప్రయాణం చేశారు. రెండు కిలోమీటర్ల మేర కాలినడకన ప్రతి చెట్టునీ పరిశీలించారు. ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనబడే అరుదైన మొక్కలు పరిశీలించి అటవీ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. నేపిరయర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుంచి మొత్తం అటవీ ప్రాంతం మొత్తం పరిశీలించారు. వెలిగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణ ముఖీ నది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది? తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
This post was last modified on November 8, 2025 7:17 pm
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…
ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…
ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టులు గందరగోళంగా మారడంతో కేంద్రం దిగివచ్చింది. ప్రయాణికుల కష్టాలు చూడలేకనో, లేక ఇండిగో లాబీయింగ్కు…
ఎన్నికలు ఏవైనా.. ప్రజలకు 'ఫ్రీ బీస్' ఉండాల్సిందే. అవి స్థానికమా.. అసెంబ్లీనా, పార్లమెంటా? అనే విషయంతో సంబంధం లేకుండా పోయింది.…
కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఒక వింత సంఘటన జరిగింది. రిసెప్షన్ వేదిక రెడీ, బంధువులంతా వచ్చేశారు, విందు భోజనాలు సిద్ధం. కానీ…
అమెరికా వీసా (H-1B, H-4) కోసం అప్లై చేసేవారికి కొత్త టెన్షన్ మొదలైంది. ఇకపై ఇంటర్వ్యూకి వెళ్లేముందు సర్టిఫికెట్లు సరిచూసుకోవడమే…