Political News

ఆ 48 మంది ఎమ్మెల్యేలకు బాబు వార్నింగ్

ఓ పక్క అమరావతి రాజధాని నిర్మాణ పనులు..మరో పక్క రాష్ట్రంలో పెట్టుబడుల కోసం విదేశాల్లో వేట..మరో పక్క సంక్షేమ పథకాల అమలుపై నేరుగా పర్యవేక్షణ…ఇలా ఏపీ సీఎం చంద్రబాబు క్షణం తీరికలేకుండా గడుపుతున్నారు. అయినా సరే ప్రతి నెలా 1వ తేదీన సామాజిక పెన్షన్ల కార్యక్రమంలో చంద్రబాబు స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు పంచుతున్నారు. అంతేకాదు, ఈ క్రమంలో వారేమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా అన్న విషయాన్ని స్వయంగా
తెలుసుకుంటారు.

ముఖ్యమంత్రి అయినా కూడా చంద్రబాబు తన ఎడతెరిపి లేని షెడ్యూల్ లో కూడా పెన్షన్ల పంపిణీ చేస్తుంటే…కొందరు ఎమ్మెల్యేలు మాత్రం పెన్షన్ల పంపిణీలో పాల్గొనడం లేదు. ఇలా, ఆ కార్యక్రమంతోపాటు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో 48 మంది ఎమ్మెల్యేలలు పాల్గొనడం లేదని సీఎం చంద్రబాబుకు నివేదిక అందింది. ఈ క్రమంలోనే ఆ 48 మందిపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఆ కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాదు, ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని టీడీపీ ప్రోగ్రాం కమిటీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వారి వివరణ తీసుకున్న తర్వాత అవసరమైతే చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. పార్టీకి ఏళ్ల తరబడి సేవ చేస్తూ విధేయులుగా ఉన్నవారిని, కష్టపడి పని చేసే కార్యకర్తలను కలుపుకుపోవాలని హితవు పలికారు.

ఇదే కాదు, ఓ పక్క చంద్రబాబు, మరో పక్క లోకేశ్ లు రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు పాటుబడుతుంటే మరొక పక్క కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరు, వ్యక్తిగత ప్రయోజనాలతో పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారు. దీంతో, వారి పంచాయతీలు తీర్చడం కోసం చంద్రబాబు, లోకేశ్ ప్రత్యేకంగా అదనపు సమయం కేటాయించాల్సి వస్తోంది. వారిద్దరికీ సహకరించాల్సింది పోయి ఇలా తలనొప్పులు తెచ్చిపెడుతున్న నేతలపై తెలుగు తమ్ముళ్లు గరంగరంగా ఉన్నారు.

This post was last modified on November 8, 2025 5:17 pm

Share

Recent Posts

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

29 minutes ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

43 minutes ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

2 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

2 hours ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

2 hours ago

దుబాయ్ విమానంలో ఫైటింగ్… 180 మందిని కాపాడిన ఇండియన్ కెప్టెన్

భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…

3 hours ago