వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో జగన్ ముద్దాయి కాబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. 60 రోజుల్లోపు జగన్ కు సూపర్ చెక్ పడుతుందని అన్నారు. జగన్ ఏం చేసినా పప్పులు ఉడకవని, జగన్ బతుకు ఘోరం కాబోతోందని, పలు కేసుల్లో ఇరుక్కోబోతున్నాడని చెప్పారు. మద్యం కేసులో జోగి రమేష్ ను సిట్ 2 విచారణ జరుపుతోందని, అంతకు ముందే లిక్కర్ స్కామ్ లో సిట్ 1 విచారణ కొనసాగుతోందని అన్నారు.
మద్యం కుంభకోణం ద్వారా భారతికి జగన్ 400 కేజీల బంగారం చేయించారని ఆరోపించారు. ఆ విషయం తాను ఎప్పుడో చెప్పానని గుర్తు చేసుకున్నారు. జగన్…నేనే రాజు నేనే మంత్రి అనే టైపులో వ్యవహరిస్తున్నారని, అదే భారతి రాజ్యాంగం అని విమర్శించారు. వివేకా కేసును సీబీఐ రీ ఓపెన్ చేయాలని, అసలు దోషులు దాక్కున్నారని చెప్పారు. భార్య, భర్త కలిసి ఏ దారుణమైనా చేస్తారని, వివేకాను చంపించింది వాళ్లేనని సంచలన ఆరోపణలు చేశారు.
కూటమి ప్రభుత్వం పెరిగి పెరిగి అంతరిక్ష స్థాయికి వెళ్లబోతోందని, జగన్ పార్టీ తరిగి తరిగి అంతరించి పోబోతోందని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో డెవలప్మెంట్ ఉందని, అమరావతి నిర్మాణం, రాష్ట్రాభివృద్ధికి నిధులు శరవేగంగా వస్తున్నాయని అన్నారు. జగన్ కు సూపర్ చెక్ పడబోతోందని, అయితే, ఆయనపై ఉన్న కేసులలో టెక్నికల్ గా, లీగల్ గా వెళ్లాలి కాబట్టి కాస్త సమయం పడుతుందని చెప్పారు. జగన్ కు బీజేపీ, కూటమి ఎప్పుడూ వ్యతిరేకమేనని తేల్చి చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates