ఒక సగటు మనిషి చేసే కామెంట్లకు…బాధ్యత గల ప్రజాప్రతినిధులు చేసే కామెంట్లకు చాలా తేడా ఉంటుంది..ఉండాలి కూడా. కానీ, ఈ మధ్యకాలంలో కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కేంద్ర మంత్రులు చేస్తున్న కామెంట్లు చూస్తుంటే…వారికన్నా కామన్ మ్యాన్ 100 రెట్లు నయం అనిపిస్తుంది. చదువూ లేదు…సంధ్యా లేదూ…అనే టైప్ పొలిటిషియన్లు టంగ్ స్లిప్ అయ్యారంటే పోనీలే అనుకోవచ్చు. కానీ, ఉన్నత విద్యావంతులు అయిన రాజకీయ నాయకులు కూడా నాలుక కరుచుకోవడం శోచనీయం. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆ కోవలోకే వస్తారు. రోడ్లను ఉద్దేశించి తాజాగా ఆయన చేసిన కామెంట్లు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మీర్జాపూర్ బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో రహదారుల నిర్మాణం, మరమ్మతులపై తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. హైదరాబాద్-తాండూర్ జాతీయ రహదారిని కొత్తగా నిర్మించాలని, ఆ మార్గంలో నిత్యం యాక్సిడెంట్లతో దాదాపు 200 మంది వరకు చనిపోయారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని, కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చేవరకు రోడ్డుపై నుంచి కదలబోమని స్థానికులు ఈ రోజు తాండూర్ లో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా కూడా నిర్వహించారు.
ఓ వైపు ఆ జాతీయ రహదారిపై ఉన్న గుంతలు, కొత్త రోడ్డు నిర్మాణం గురించి చర్చ, ధర్నాలు, ఆందోళనలు జరుగుతుంటే మరోవైపు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అందుకు పూర్తి భిన్నంగా ఇచ్చిన స్టేట్మెంట్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్లు ఖరాబ్ ఉంటేనే యాక్సిడెంట్లు కావని, రోడ్లు మంచిగుంటేనే యాక్సిడెంట్లు అవుతాయని బాధ్యతారాహిత్యంగా ఆయన మాట్లాడిన మాటలపై ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.
రోడ్లు నున్నగా, కొత్తగా, బాగుంటే వాహనాలను అతి వేగంతో నడుపుతారు, కాబట్టి ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి అనే యాంగిల్ లో పల్లెటూరి జనం మాట్లాడుకుంటూ ఉంటారు. రోడ్లపై గుంతలు ఉంటేనే మంచిదని, నిదానంగా వాహనాలు వెళతాయి కాబట్టి యాక్సిడెంట్లు జరగవని రచ్చబండ సమావేశాల్లో జనం నిపుణుల మాదిరి అభిప్రాయడుతుంటారు. అయితే, రాత్రి పూట రోడ్లపై గుంతలు కనిపించక, పగటి పూట గుంతలు కనిపించినా వాటిని తప్పించబోయి ప్రమాదాలకు గురైన వాహనాలు కోకొల్లలు. ఈ విషయం ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తికి తెలియకుండా ఉండదు.
అయినప్పటికీ, సగటు మనిషి మాదిరిగా రోడ్లు ఖరాబ్ గా ఉంటేనే ప్రమాదాలు జరగవన్న అభిప్రాయాన్ని మీడియా ముందు వ్యక్తపరచడం నిజంగా విచారకరం. మరి, తన కామెంట్లపై విమర్శలు వస్తున్న క్రమంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి క్లారిటీనిచ్చే ప్రయత్నం చేస్తారా లేక తన వ్యాఖ్యలను సమర్థించుకుంటారా అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా తెలంగాణలో గుంతలతో ఉన్న రోడ్లు అలాగే ఉంచాలని, కొత్త రోడ్లు అవసరం లేదని అర్థం వచ్చేలా కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్లు ట్రోలర్లకు మంచి మెటీరియల్ ఇచ్చాయి.
This post was last modified on November 4, 2025 8:54 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…