Political News

ఆ ఇద్ద‌రినీ అలా సంతృప్తి ప‌రిచిన రేవంత్ రెడ్డి

మంత్రి ప‌ద‌వులు ఆశించిన వారి విష‌యంలో సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ముఖ్యంగా ఇద్ద‌రు సీనియ‌ర్ నేత‌లు.. రేవంత్‌రెడ్డి మంత్రి వ‌ర్గంలో చోటు కోసం ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే.. వివిధ కార‌ణాల‌తో వారికి అవ‌కాశం చిక్క‌లేదు. నిజానికి 18 మంది వ‌ర‌కు మంత్రివ‌ర్గంలో చోటు ల‌భించే అవ‌కాశం ఉంది. కానీ.. పూర్తిస్థాయిలో మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రించ‌ లేదు. తాజాగా చేసిన విస్త‌ర‌ణ‌లోనూ ఒక్క‌రికి మాత్ర‌మే అవ‌కాశం క‌ల్పించారు.

దీంతో మంత్రివ‌ర్గంలో చోటు కోసం.. కొన్నాళ్లుగా ప్ర‌య‌త్నించ‌డంతోపాటు.. సీఎం రేవంత్ రెడ్డి నుంచి కూడా హామీపొందారన్న చ‌ర్చ ఉన్న ఇద్ద‌రు నాయ‌కుల‌కు.. కూడా అవ‌కాశం చిక్క‌లేదు. దీంతో తాజాగా వారిలో ఒక‌రికి కార్పొరేష‌న్ ప‌ద‌విని.. మ‌రొక‌రికి కొత్త‌గా స‌ల‌హారు పోస్టును క్రియేట్ చేసి.. మంత్రుల‌కు ఉండే అన్ని స‌దుపాయాల‌ను క‌ల్పించారు. అదేవిధంగా భ‌ద్ర‌త నుంచి కాన్వాయ్ వ‌ర‌కు కూడా సౌక‌ర్యాలు క‌ల్పించారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఎవ‌రు వారు?

1) మంచిర్యాల నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న కొక్కిరాల ప్రేమ్ సాగ‌ర్‌రావు. ఈయ‌న‌ను రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల సంస్థ చైర్మ‌న్‌గా నియ‌మించారు. ఇది త‌క్ష‌ణం అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని ప్ర‌భుత్వం తెలిపింది. మంత్రుల‌కు క‌ల్పించేకేబినెట్ హోదాతో పాటు.. కాన్వాయ్‌, భ‌ద్ర‌త‌ను కూడా క‌ల్పిస్తారు. అదేవిధంగా వేత‌నాల‌ను కూడా మంత్రుల‌కు ఇచ్చే వేత‌నాల‌నే ఇస్తారు.

2) పి. సుద‌ర్శ‌న్ రెడ్డి: ఈయ‌న బోధ‌న్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కుడు. గ‌తంలోనూ మంత్రిగా ప‌నిచేశారు. ఈయ‌న కూడా పార్టీ విజ‌యం ద‌క్కించుకున్నాక‌.. మంత్రి వ‌ర్గంలో సీటు కోసం ప్ర‌య‌త్నించారు. తాజాగా అయినా.. ద‌క్కుతుంద‌ని కొన్నాళ్లుగా వేచి చూస్తున్నారు. అయితే.. సీటు ద‌క్క‌లేదు. దీంతో స‌ర్కారుకు స‌ల‌హాదారుగా నియ‌మించారు. మంత్రుల‌కు వ‌ర్తించే అన్ని సౌక‌ర్యాల‌తో పాటు కాన్వాయ్‌, భ‌ద్ర‌త ల‌భిస్తుంది. అంతేకాదు.. మంత్రివ‌ర్గ స‌మావేశాల‌కు ప్ర‌త్యేక ఆహ్వానితుడిగా కూడా వ‌చ్చేందుకు అవ‌కాశం క‌ల్పించారు.

This post was last modified on October 31, 2025 6:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

1 hour ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

2 hours ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

2 hours ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

3 hours ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

3 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

4 hours ago