మూడు రాష్ట్రాల‌కు కునుకు క‌రువు: ఏంటీ `మొంథా`?

మూడు రాష్ట్రాల‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తున్న తుఫాను.. మొంథా!. ఏపీ, త‌మిళ‌నాడు, ఒడిశా రాష్ట్రాల్లోని ప్ర‌భుత్వం అలెర్ట్ అయ్యాయి. ఆదివారం రాత్రి నుంచే ప్ర‌భుత్వాలు అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్నాయి. ఇక‌, సోమ‌వారం.. ఉద‌యం నుంచి మ‌రింత‌గా అలెర్ట్ అయ్యాయి. తీర ప్రాంత ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే త‌మిళ‌నాడులోని చెన్నై తీర ప్రాంతంలో వేలాది మందిని పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లించారు. ఇక‌, ఏపీలోనూ తీర ప్రాంత జిల్లాల‌కు చెందిన వేల మందిని సేఫ్ జోన్ల‌కు త‌ర‌లించారు. ఒడిశాలోనూ క‌ళింగ ప‌ట్నం స‌హా ఇత‌ర ప్రాంతాల్లోని తీర జిల్లాల‌ప్ర‌జ‌ల‌ను షెల్ట‌ర్‌ల‌కు త‌ర‌లించారు.

దోబూచులు..

ఇక‌, మొంథా తుఫాను వ్య‌వ‌హారం చూస్తే.. ఇది దోబూచులాడుతోంద‌నే చెప్పాలి. కొంత సేపు విశాఖ‌కు స‌మీపంగా వ‌స్తూ.. ఇంత లోనే కాకినాడ తీరం వైపు మ‌ళ్లుతోంది. స‌రే.. ఇది ఒకే తీరంలో ఉంద‌ని అనుకున్నా.. మ‌రికొద్ది సేప‌టితే.. చెన్నైకి ఆగ్నేయంగా బంగాళా ఖాతంలో త‌చ్చాడుతోంది. దీంతో తుఫాను ద‌శ‌.. ఎప్పటి క‌ప్పుడు మారుతోందని అంటున్నారు నిపుణులు. దీనివ‌ల్ల ఎప్పుడు ఎలాంటి ప్ర‌మాదం పొంచి ఉంటుందోన‌న్న బెంగ ప్ర‌భుత్వాల‌ను, ప్ర‌జ‌ల‌ను కూడా వెంటాడుతోంది. ఒక్కొక్క‌సారి ఇంత భీక‌రంగా ఉన్న ప‌రిస్థితి కూడా తృటిలో తేలిపోయిన ప‌రిస్థితి ఉంద‌ని కూడా వాతావ‌ర‌ణ నిపుణులు చెబుతున్నారు.

అలాగ‌ని.. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిని కూడా త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌డానికి వీల్లేద‌న్నారు. ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌కుండా ఇప్ప‌టికే మూడు రాష్ట్రాలు కూడా ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకున్నాయి. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం క‌లెక్ట‌ర్ల‌కు పూర్తి, అద‌న‌పు అధికారాలు ఇచ్చింది. ఒడిశాలోనూ దాదాపు ఇంతే. ఇక‌, ఏపీలో అయితే.. స్వ‌యంగా సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్‌లు స్వ‌యంగా ప‌ర్యవేక్షిస్తున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు.. ప‌రిస్థితిని అంచ‌నా వేస్తున్నారు. ఏదేమైనా.. సోమ‌వారం అర్ధ‌రాత్రి నుంచి మంగ‌ళ‌వారం తెల్ల‌వారు జాము మ‌ధ్య వ‌ర‌కు మొంథా తుఫాను ప‌రిస్థితిని అంచ‌నా వేయ‌డంక‌ష్ట‌మేన‌న్న‌ది నిపుణుల మాట‌.

మొంథా అంటే ఏంటి?

గ‌త రెండు ద‌శాబ్దాలుగా..తుఫాన్ల‌కు పేర్లు పెడుతున్నారు. దీనివ‌ల్ల ప్ర‌జ‌ల‌ను అలెర్ట్ చేయ‌డం.. స‌మాచారాన్ని వేగంగా అందించేందుకు దోహ‌ద‌ప‌డుతున్న క్ర‌మంలో ఈ పేర్లు వ‌స్తున్నాయి. ఇక‌, స‌ముద్రంలోని విభాగాల‌ను బ‌ట్టి..పేర్ల నిర్ణ‌యం ఉంటోంది. అరేబియా స‌ముద్రంలో పుట్టే తుఫాన్ల‌కు.. ప్ర‌ముఖుల పేర్లు పెడుతుండ‌గా.. బంగాళాఖాతంలో జ‌నిస్తున్న వాయుగుండాలు.. తుఫానులుగా మారితే.. వారికి పువ్వుల పేర్లు పెడుతున్నారు. ఈ క్ర‌మంలోనే థాయ్‌లాండ్ ప్ర‌స్తుత తుఫానుకు మొంథా అని నామ‌క‌ర‌ణం చేసింది. దీని అర్ధం సువాస‌నా పుష్పం. బంగాళాఖాతంలో గ‌తంలో వ‌చ్చిన తుఫానుకు తిత్లీ అని పేరు పెట్టిన విష‌యం తెలిసింది. దీనికి కూడా అదే అర్ధం కావ‌డం విశేషం. ఇలా..వ‌చ్చిందే ప్ర‌స్తుత మొంథా పేరు!