Political News

ఉద్యమాలే వేరు.. రాజకీయాలు వేరుగా బ్రదర్…!

ఉద్యమాల్లో ఉన్నవారు.. రాజకీయాల్లోకి రావడం అరుదేనని చెప్పాలి. గతంలో లోకాయుక్త కోసం ఉద్యమించిన అన్నాహజారే.. సారా రహిత రాష్ట్రం కోసం ఉద్యమించిన దూబగుంట పార్వతమ్మ (నెల్లూరు).. ఇలా చాలా మంది రాజకీయాల్లోకి రావాలని ఆఫర్లు వచ్చినా.. రాలేదు. ఎందుకంటే.. ఉద్యమం వేరు. రాజకీయాలు వేరు. అంతెందుకు.. దేశ స్వాతంత్య్రం కోసం పనిచేసిన మహాత్ముడు కూడా.. రాజకీయాల్లోకి రాలేదు. ఎందుకంటే.. ఉద్యమంలో ఉన్నప్పుడు ఉన్న స్వేచ్ఛ.. రాజకీయాల్లోకి వచ్చాక సహజంగానే ఉండదు.

అనేక నియమాలు, రాజకీయంగా ఉండే ఒత్తిడులు, సామాజిక వర్గాల సమన్వయం, ఓటు బ్యాంకు, పార్టీ లైన్లు.. ఇలా అనేక అంశాలు నాయకులకు పరిధులు విధిస్తాయి. అందుకే.. ఉద్యమాల్లో నుంచి వచ్చి.. రాజకీయాల్లో సక్సెస్ అయిన వారు కూడా పెద్దగా మనకు కనిపించరు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సక్సెస్ అయినా.. ఆయన దానిని నిలబెట్టుకోలేకపోయారు. ఇక, లోక్స్‌త్తా ఉద్యమంతో రాజకీయ బాట పట్టిన జయప్రకాశ్ నారాయణ్ (మాజీ ఐఎఎస్) కూడా.. తన సత్తా చాటలేకపోయారు.

ఒకసారి విజయంతోనే జేపీ సరిపెట్టుకున్నారు. దీనికి ప్రధాన కారణం.. రాజకీయాలకు, ఉద్యమాలకు ఉన్న విభిన్నమైన తేడానే! ఈ విషయం ఇప్పుడు ఎందుకు ప్రస్తావనకు, చర్చకు వచ్చిందంటే.. అమరావతి ఉద్యమంతో వెలుగులోకి వచ్చిన కొలికపూడి శ్రీనివాస్.. గత ఎన్నికలకు ముందు రాజకీయ బాట పట్టారు. అమరావతి ఉద్యమంలో ఉన్న వారిలో ఈయన ఒక్కరికే రాజకీయంగా అవకాశం కూడా లభించింది. కానీ, ఆయన ఉద్యమానికి.. రాజకీయాలకు మధ్య తేడాను గుర్తించలేక.. తడబడ్డారని వాదనలు వినిపిస్తున్నాయి.

ఉద్యమంలో ఉన్నప్పుడు ఒకటే సిద్ధాంతం ఉంటుంది. ఒకటే లైన్ కూడా ఉంటుంది. దాని సాకారమే పరమావధిగా నాయకులు ముందుకు సాగుతారు. కానీ, పైన చెప్పుకున్నట్టుగా రాజకీయాల్లో ఒకే పంథా ఉండదు. సమయానికి తగిన విధంగా నాయకులు మార్పు చెందాలి. ఒక్కోసారి విమర్శలు కూడా వస్తాయి. మరికొన్ని సార్లు అవమానాలు కూడా ఎదురవుతాయి. వీటిని తట్టుకుని నిలబడటం అనేది రాజకీయాల్లో కీలక అంశం. చంద్రబాబే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఆయనను జైలులో పెట్టినా.. కుటుంబాన్ని విమర్శించినా.. తట్టుకుని నిలబడ్డారు. ఈ తేడా గమనిస్తే.. ఉద్యమ కారులు సక్సెస్ అవుతారు. లేకపోతే.. ఇదే మొదలు.. ఇదే చివర అవుతుందని గుర్తించాలి.

This post was last modified on October 27, 2025 1:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘పవన్ అన్న’ మాటే… ‘తమ్ముడు లోకేష్’ మాట!

కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…

2 hours ago

అవకాశాన్ని ఆంధ్రకింగ్ వాడుకుంటాడా

రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…

4 hours ago

అఖండ 2 ఆగింది… అసలేం జరుగుతోంది

బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…

5 hours ago

అన్నగారు వచ్చేలా లేరు

నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…

6 hours ago

‘హైదరాబాద్ హౌస్’లో పుతిన్ బస.. ఈ ప్యాలెస్ ఎవరిదో తెలుసా?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…

10 hours ago

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

13 hours ago