జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడుతారు? అనేది ఇంకా సస్పెన్స్‌గా ఉంది. ఎందుకంటే ప్రజల నాడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న సంస్థలకు కూడా రోజుకో రకంగా సమాచారం వస్తోంది. కొన్ని చోట్ల సానుభూతి వర్కవుట్ అవుతుండగా, మరికొన్ని చోట్ల సర్కారు పథకాల జోరు పై చర్చ సాగుతోంది. కొన్ని చోట్ల మోడీ మానియా కూడా కనిపిస్తోంది. ఇలా, అటు బీఆర్ ఎస్, ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ పరిస్థితి ఇంకా అంతు చిక్కడం లేదు. మరోవైపు మహిళా సెంటిమెంట్ తమకు లాభిస్తుందన్న ధీమా, తన భర్త చేసిన మంచి తనకు కలిసి వస్తుందన్న ఆశ ప్రధాన ప్రతిపక్షంలో కనిపిస్తోంది.
ఈ లెక్కలతో ఇప్పటి వరకు గెలుపు పైనే ఎవరికీ అంచనా అందడం లేదు. మరోవైపు అతిరథులు ఇంకా ప్రచారంలోకి రాలేదు. మరొ 17 రోజులు వరకు ప్రచార పర్వానికి అవకాశం కూడా ఉంది. ఇలాంటి సందర్భంలో లెక్కలు ఎప్పుడు, ఎలా మారుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కొన్నాళ్ల కిందట ఓపీనియన్ పోల్స్ అభిప్రాయం ప్రకారం బీఆర్ ఎస్‌కు ఎడ్జ్ ఉందని సంకేతాలు వచ్చాయి. కానీ, తర్వాత స్థానికంగా చేసిన మరో సర్వేలలో ఎడ్జ్ తగ్గుముఖం పట్టింది. పైగా కాంగ్రెస్‌కు ఎడ్జ్ పెరుగుతోందని తేలింది. ఇక, ఎవరికి వారు చేయించుకున్న సర్వేలలోనూ వారి అభ్యర్థులకే అనుకూలంగా మార్కులు పడ్డాయి.
అయితే, ఇప్పటికీ జూబ్లీహిల్స్ ఓటరు నాడి తమిత్థంగా ఎవరికీ అనుకూలంగా ఉందన్నది స్పష్టంగా తెలియడం లేదు. కానీ ఇప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ తాము సొంతం చేసుకుంటామని చెప్పింది. నిజానికి గత ఎన్నికల్లో మూడో స్థానంలో ఉన్న నవీన్ యాదవ్‌ను ఇప్పుడు బరిలోకి దింపారు. అప్పట్లో ఆయన 35 వేల ఓట్లకే పరిమితం అయ్యి డిపాజిట్ కోల్పోయారు. మరి ఆయన ఇప్పుడు ఎలా పుంజుకుంటారో, భారీ మెజారిటీ ఎలా దక్కించుకుంటారో చూడాలి.
ఇక, బీజేపీ అభ్యర్థి లంకలపల్లి దీపక్ రెడ్డి కూడా తనకు 50 వేల పైచిలుకు మెజారిటీ వస్తుందని అంచనా వేస్తున్నారు. కానీ, ఈయన కూడా గత ఎన్నికల్లో చతికిల పడ్డారు. మరోవైపు, బీఆర్ ఎస్ పార్టీ లక్ష ఓట్ల మెజారిటీల లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.
కేటీఆర్ మాట్లాడుతూ, తమ పార్టీకి లక్ష ఓట్ల మెజారిటీ దాటినా ఆశ్చర్యం లేదని తెలిపారు. ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకత, కేసీఆర్ పై పెరుగుతున్న సానుభూతి, సునీతమ్మకు ఉన్న మంచితనం, మాగంటి ఫ్యామిలీకి ఉన్న ఆదరణ వంటివి తాము పొందుతున్నామని తెలిపారు.
మొత్తానికి, గెలుపుపై ఇంకా స్పష్టత లేని నియోజకవర్గంలో మెజారిటీ లెక్కలు వేసుకోవడం ఓటర్లను మరొక రూపంలో ఆకర్షించడమేనని విశ్లేషకులు అంటున్నారు.
This post was last modified on October 26, 2025 10:48 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…