తెలంగాణ ప్రభుత్వానికి ఊహించని ప్రశంస దక్కింది. `తెలంగాణ రోల్ మోడల్ స్టేట్` అంటూ.. ఆస్ట్రేలియాలోని `విక్టోరియా` పార్లమెంటు సభ్యులు ప్రశంసలతో ముంచెత్తారు. పారదర్శక పాలన, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం, అధికారుల పనితీరు, మంత్రుల సమన్వయం.. ప్రజలకు అందుతున్న పాలనా ఫలాలు.. ఇలా అనేక విషయాల్లో తెలంగాణ రోల్ మోడల్‌గా ఉందని కొనియాడారు. విక్టోరియా-తెలంగాణల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు.
ప్రస్తుతం తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు.. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు రావడమే లక్ష్యంగా.. ఆయన పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా శుక్రవారం ఉదయం ఆయన.. విక్టోరియాలోని పార్లమెంట్‌ను సందర్శించారు. ఇది ప్రత్యేక అధికారాలను.. పాలనను కలిగి ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా లెజిస్లేటివ్ కౌన్సిల్ , ప్రభుత్వ విప్,… లీ తార్లామిస్, పార్లమెంటరీ సెక్రటరీ షీనా వాట్‌లు.. మంత్రికి ఘన స్వాగతం పలికారు.
అనంతరం.. మంత్రి శ్రీధర్‌బాబు.. వారికి రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాలు.. హైదరాబాద్ అభివృద్ది, మెట్రో రైళ్ల విస్తరణ, ఫ్యూచర్ సిటీ నిర్మాణం.. ఇలా.. అనేక విషయాలను వివరించారు. అదేసమయంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గురించి కూడా ఆయన వివరించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు.. పాదర్శకంగా.. జవాబుదారీ తనంతో పనిచేస్తున్నారని వివరించారు. అకౌంటబిలిటీపై సుదీర్ఘంగా చర్చించారు. పారదర్శకత, జవాబుదారీతనం పెరగాలంటే పౌరుల భాగస్వామ్యం కీలకమన్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆయన విక్టోరియా ప్రజాప్రతినిధులను, మంత్రులను కోరారు. టెక్నాలజీ ఆధారిత, సిటిజన్ సెంట్రిక్ పాలనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలని కోరారు. తెలంగాణలో విక్టోరియా ఇన్‌స్టిట్యూషనల్ సహకారం పెంచేందుకు చొరవ చూపుతామన్నారు. ప్రోగ్రెసివ్ లెజిస్లేటివ్ ప్రాక్టీసెస్, గవర్నెన్స్ రిఫార్మ్స్, డిజిటల్ కార్యాచరణలను కూడా వారికి వివరించారు.
This post was last modified on October 24, 2025 7:20 pm
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…
అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…
బలంగా మాట్లాడాలి. మాటకు మాట కౌంటర్ ఇవ్వాలి. అది వింటే ప్రత్యర్థులు నోరు అప్పగించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…