అసెంబ్లీ ఎన్నికలకు సమయం చేరువ అవుతున్న నేపథ్యంలో స్థానిక సెంటిమెంటుకు మరింత పదును పెంచుతూ.. తమిళనాడు ప్రభుత్వంకీలక నిర్ణయం తీసుకుంది. ఈ రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. రాష్ట్రంలో కొన్నాళ్లుగా డిమాండ్ రూపంలో ఉన్న హిందీ రద్దును అధికారికం చేసేందుకు నడుం బిగించారు. తద్వారా.. స్థానిక తమిళ భాషకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన చెప్పకనే చెప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాలు రాజకీయంగా కూడా వేడెక్కించాయి. బీజేపీ ఇక్కడ పాగా వేయాలని ప్రయత్నిస్తున్న సమయంలో అనూహ్య నిర్ణయం ఆ పార్టీని ఇరకాటంలో పడేసింది.
ఏం జరిగింది?
స్వభాషకు ప్రాధాన్యం ఇచ్చే రాష్ట్రాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులు ముందుంటాయి. తమిళనాడులో కొన్నాళ్లు హిందీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు సాగుతున్నాయి. కేంద్రంలో మోడీ సర్కారు వచ్చిన దరిమిలా.. త్రిభాషా సూత్రాన్ని భారీగా ప్రచారంలోకి తీసుకువచ్చారు. దీని కింద.. స్థానిక+హిందీ+ఇంగ్లీష్ భాషలను పిల్లలకు బోధించాల్సి ఉంటుంది. హిందీని ఇక, వ్యవహారిక భాషగా కూడా గుర్తిస్తారు. కేంద్రం నిర్వహించే పరీక్షల్లోనూ హిందీని వినియోగిస్తారు. అయితే.. దీనిపై తమిళనాడులో ఉద్యమాలు సాగాయి. నిరసనలు పెల్లుబికాయి. హిందూ ఉద్యమం పేరుతో కొన్నాళ్ల కిందట చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా కూడా మారాయి.
ఆ సమయంలో అసెంబ్లీలో మాట్లాడిన సీఎం స్టాలిన్ హిందీని రద్దు చేసేందుకు ప్రత్యేకంగా చట్టం తీసుకువస్తామన్నారు. దీనిపై అధ్యయనం చేసేందుకునిపుణుల కమిటీని వేస్తామనికూడా చెప్పారు. ఈ క్రమంలో నిపుణుల కమిటీని కొన్నాళ్ల కిందటే నియమించారు. తాజాగా ఈ కమిటీ నివేదిక అందించింది. దీని ప్రకారం హిందీ భాషకు సంబంధించిన హోర్డింగులు, ప్రకటనలు, సినిమాలు, స్థానిక రేడియోలో హిందీ పాటల ప్రసారాలను, వ్యవహారిక భాషగా గుర్తింపు వంటి వాటిని రద్దు చేయాలని నిపుణుల కమిటీ సూచించింది.
దీనిపై తాజాగా సీఎం స్టాలిన్ నేతృత్వంలోని మంత్రి వర్గం భేటీ అయి చర్చించింది. త్వరలోనే జరగనున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో.. ఈ బిల్లును సభలో పెట్టి ఆమోదించాలని నిర్ణయించారు. అనంతరం.. గవర్నర్ అనుమతితో దీనిని చట్టం చేయనున్నారు. అయితే.. ఇది జాతీయ విద్యా విధానం కింద తీసుకువచ్చిన ప్రక్రియ అని బీజేపీ నాయకులు చెబుతున్నారు. దీనిలో ప్రజలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని.. హిందీ ఇష్టం లేని వారుఇతర భాషలను అభ్యసించే అవకాశంఉందని పేర్కొన్నారు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని స్టాలిన్ చేస్తున్న రాజకీయంగా వారు అభివర్ణించారు.
This post was last modified on October 15, 2025 9:58 pm
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…