Political News

గూగుల్ రాక: జనాలకు మేలెంత?

ఏపీ ప్రభుత్వం మంగళవారం ఢిల్లీలో గూగుల్, దాని అనుబంధ సంస్థ రైడైన్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం విశాఖలో భారీ పెట్టుబడి రానుంది. ఇది ఆసియాలోనే అతి పెద్ద గూగుల్ పెట్టుబడిగా చెబుతున్నారు. 88 వేల కోట్ల రూపాయలను తొలిదశలో పెట్టుబడి పెట్టనున్నారు. అనంతరం దీనిని లక్షల కోట్లకు పైగానే విస్తరించనున్నారు. లక్షకు పైగా ఉద్యోగాలను దశల వారీగా ఇవ్వనున్నారు. ఇక ఈ పెట్టుబడులతో డేటాకు సంబంధించిన అన్ని విభాగాలు విశాఖ కేంద్రంగానే సాగనున్నాయి.

ఫలితంగా విశాఖ పేరు ప్రపంచ స్థాయిలో వినిపించనుంది. అయితే దీనివల్ల స్థానికంగా ఉన్న జనాలకు జరిగే మేలెంత? అనేది కీలకం. ఎందుకంటే సీఎం చంద్రబాబుపై తాజాగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వేరేగా ఉంది. ఉన్నత స్థాయి వర్గాలకు ఆయన పెద్దపీట వేస్తున్నారని, వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. పెట్టుబడుల పేరుతో పెద్దలకు భూములు ఇస్తున్నారని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్ డేటా సెంటర్ వచ్చినా పార్టీ నాయకుల వరకే ఈ ప్రభావం కనిపించింది.

సాధారణ ప్రజల్లో ఎలాంటి పెద్ద ఊపు, ఉత్సాహం రాలేదు. దీనిని బట్టి గూగుల్ డేటా కేంద్రం వంటి అతి పెద్ద పెట్టుబడి వచ్చినా తమకు పెద్దగా ఒనగూరే ప్రయోజనం లేదని వారు భావిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అసలు ఈ డేటా సెంటర్‌తో ఒనగూరే ప్రయోజనాలు సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఎలా ఉంటాయన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఈ విషయంపై చర్చ ఎక్కువగా జరుగుతోంది.

ఇవీ ప్రయోజనాలు:

గూగుల్ డేటా సెంటర్ రాకతో దేశ, విదేశీ రాకపోకలు విశాఖకు పెరుగుతాయి.

ఫలితంగా రవాణా రంగానికి ఇది ఊతమిస్తుంది. డ్రైవర్లు, రవాణా రంగంపై ఆధారపడిన వారికి ప్రయోజనం.

డేటా కేంద్రంలో సుమారు లక్ష మందికిపైగా ఉద్యోగాలు రానున్నాయి. వీరివల్ల స్థానికంగా ఇళ్లకు డిమాండ్ పెరుగుతుంది. స్థానికులకు రాబడి వస్తుంది.

అపార్ట్‌మెంట్లు సహా సొంత ఇళ్లకు ధరలు పెరగనున్నాయి.

ఇక స్థానిక సంస్థలకు పన్నులు, సెస్సుల రూపంలో ఆదాయం పెరుగుతుంది.

స్థానికంగా చేసుకునే వ్యాపారాలకు డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం పుంజుకుంటుంది.

మాల్స్ పెరుగుతాయి. తద్వారా స్థానికంగా ఉపాధి, ఉద్యోగాలు కూడా పెరుగుతాయి.

ఐటీ రంగంలో కోచింగ్ సెంటర్లు వెలుస్తాయి. ఫలితంగా స్థానిక యువత వేరే ప్రాంతాలకు వెళ్లకుండా విశాఖలోనే చదివే అవకాశం ఉంటుంది.

ఏపీలో ఐటీ నిపుణులకు ఉద్యోగాలు లభించనున్నాయి.

తినుబండారాలు, కేటరింగ్ సంస్థలకు కూడా మరింత పనులు లభించనున్నాయి.

This post was last modified on October 15, 2025 5:31 pm

Share

Recent Posts

సుకుమార్ మీద దేవి ఫ్యాన్స్ ఎటాక్

కొంద‌రు ద‌ర్శ‌కులు టెక్నీషియ‌న్ల విష‌యంలో చాలా ప‌ర్టికుల‌ర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…

1 hour ago

సైలెంటుగా వ‌చ్చి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టేసింది

నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమ‌మ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన న‌టుడు. ఆ…

6 hours ago

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

10 hours ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

12 hours ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

12 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

13 hours ago