Political News

విజ‌య్‌కు రిలీఫ్‌: క‌రూర్ తొక్కిస‌లాట‌పై `సీబీఐ`

త‌మిళ‌గ వెట్రి క‌ళ‌గం(టీవీకే) పార్టీ అధినేత‌, సినీ హీరో ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్‌కు భారీ ఉర‌ట ల‌భించింది. ఆయ‌న కోరుకున్న‌ట్టుగానే త‌మిళ‌నాడులో జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై సీబీఐతో ద‌ర్యాప్తు చేయించేందుకు సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. దీంతో సీబీఐ విచార‌ణ‌కు మార్గం సుగమం అయింది. కొన్నాళ్ల కింద‌ట‌.. సీబీఐ వేసేందుకు మ‌ద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ నిరాక‌రించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో విజ‌య్ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. అప్ప‌ట్లో అటు ప్ర‌భుత్వాన్ని, ఇటు విజ‌య్‌ను కూడా సుప్రీంకోర్టు త‌ప్పుబ‌ట్టింది.

ఈ సంద‌ర్భంగా జ‌స్టిస్ మ‌హేశ్వ‌రి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జ‌ల ప్రాణాల ప‌ట్ల బాధ్య‌త లేకుండా పోతోందని, క‌రూర్ ఘ‌ట‌న దేశాన్ని తీవ్రంగా ప్ర‌భావితం చేసింద‌ని, అంద‌రినీ దిగ్భ్రాంతికి గురి చేసింద‌ని వ్యఖ్యానించారు. ఈ ఘ‌ట‌న వెనుక అనేక సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌న్న వాద‌న కూడా వినిపిస్తోంద‌న్నారు. ఈ నేప‌థ్యంలో సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించ‌డ‌మే స‌రైన విధాన‌మ‌ని పేర్కొన్నారు. ఈ విచార‌ణ‌కు ప‌ర్య‌వేక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తి అజ‌య్ ర‌స్తోగీ నేతృత్వంలో త్రిస‌భ్య క‌మిటీని కూడా ఏర్పాటు చేస్తున్న‌ట్టు తెలిపారు. ఈ కేసు ద‌ర్యాప్తు పురోగ‌తిని ప్ర‌తి నెలా కోర్టుకు స‌మ‌ర్పించాల‌ని పేర్కొన్నారు.

41 మంది మృతి-అనేక విమ‌ర్శ‌లు..

గ‌త సెప్టెంబ‌రు 27న టీవీకే పార్టీ అధినేత విజ‌య్ పార్టీ ప్ర‌చారంలో భాగంగా క‌రూర్ జిల్లా వేలు సామి పురంలో ర్యాలీ నిర్వ‌హించారు. దీనికి భారీ ఎత్తున జ‌నాల‌ను స‌మీక‌రించారు. ఈ క్ర‌మంలో తొక్కిస‌లాట జ‌రిగి .. తొలుత 10 మంది త‌ర్వాత‌.. 22 మంది చివ‌ర‌కు 41 మంది మృతి చెందారు. ఈ ఘ‌ట‌న రాజ‌కీయంగా దుమారం రేపింది. అధికార పార్టీ డీఎంకేపై ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పించాయి. స‌రైన ఏర్పాట్లు చేయ‌నందుకే ఇలా జ‌రిగింద‌ని బీజేపీ నాయ‌కులు, అన్నా డీఎంకే నేత‌లు విరుచుకుప‌డ్డారు.

అయితే.. డీఎంకే మాత్రం విజ‌య్ త‌ప్పుచేశార‌ని, చెప్పిన స‌మ‌యానికి రాకుండా.. జ‌న స‌మీక‌ర‌ణ కోసం ప్ర‌య‌త్నించార‌ని ఆరోపించింది. హైకోర్టు మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ అరుణ నేతృత్వంలో క‌మిటీ వేశారు. కానీ, విజ‌య్ మాత్రం అస‌లు సీబీఐ విచార‌ణ చేయించాల‌ని కోరారు. మొత్తానికి ఈ విష‌యంలో ఆయ‌న‌కు రిలీఫ్ ల‌భించింది. అయితే.. ఈ ద‌ర్యాప్తు.. ఎప్ప‌టికి ముగుస్తుంద‌న్న విష‌యంపై సుప్రీంకోర్టు ఎలాంటి గ‌డువు విధించ‌లేదు.

This post was last modified on October 13, 2025 3:30 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Vijay

Recent Posts

సూపర్ న్యూస్… సుబ్బులక్ష్మిగా సాయిపల్లవి ?

భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు…

45 minutes ago

పదిరోజుల్లోనే మాట నిలబెట్టుకున్న పవన్

మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…

3 hours ago

మంచు మనోజ్ సినిమాకు మల్టీస్టారర్ హంగులు ?

నటుడిగా చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో విలన్ గా నటించి కంబ్యాక్ అయ్యాడు.…

3 hours ago

తెలుగు ఐపీఎస్ సూసైడ్ ఎఫెక్ట్.. డీజీపీపై బదిలీ వేటు!

హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…

4 hours ago

మెస్సీ పక్కన సీఎం భార్య.. ఇదేం ఆటిట్యూడ్ బాబోయ్

మెస్సీ ఇండియాకు రావడమే ఒక పండగలా ఉంటే, ముంబైలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్…

4 hours ago

వెయ్యి కోట్ల టార్గెట్ అంత ఈజీ కాదు

దురంధర్ అంచనాలకు మించి దూసుకుపోతున్న మాట నిజమే. అఖండ 2 వచ్చాక స్లో అవుతుందనుకుంటే రివర్స్ లో నిన్న వీకెండ్…

5 hours ago