టీడీపీ నాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై జనసేన నాయకులు, కార్యకర్తలు ఇటీవలి కాలంలో అంతర్గతంగా అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా బాలయ్య సభలో చేసిన వ్యాఖ్యలు జనసేన వర్గాల్లో కలకలం రేపాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. దీంతో బాలయ్యపై మీమ్స్, కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించడమే కాకుండా పరిస్థితిని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఇదిలావుండగా, తాజాగా బాలయ్య చేసిన పనితో జనసేన వర్గాలు కూల్ అయ్యాయనే చర్చ సాగుతోంది.
జనసేన ఎమ్మెల్యే, కాకినాడ రూరల్ ప్రతినిధి పంతం నానాజీ కుమారుడి వివాహం విజయవాడలో శుక్రవారం జరిగింది. ఈ వేడుకకు బాలయ్య హాజరయ్యారు. అక్కడ ఆయన జనసేనకు చెందిన పలువురు నాయకులతో సత్సహజంగా కలిసిపోయారు. వారితో పలు విషయాలపై మాట్లాడి, నవ్వుతూ సంభాషించారు. పంతం కుమారుడిని, కాబోయే కోడలిని ఆశీర్వదించిన బాలయ్య కొంతసేపు మండపంలోనే ఉన్నారు.
దీంతో జనసేన వర్గాల్లో సంతృప్తి వ్యక్తమైందని తెలుస్తోంది. ఇటీవల అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన నాయకులు ఇప్పుడు కొంత సడలినట్టుగా కనిపిస్తున్నారు. అప్పట్లో కొందరు బాలయ్య నుంచి క్షమాపణలు కోరగా, మరికొందరు సీఎం చంద్రబాబు ఆయన్ని అడ్డుకోవాలని వ్యాఖ్యానించారు.
అయితే ఇప్పుడు బాలయ్య నానాజీ కుటుంబ వేడుకలో పాల్గొనడం, ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకపోవడం ద్వారా తాను, జనసేన మధ్య ఎలాంటి విభేదాలు లేవన్న సంకేతం ఇచ్చినట్టుగా అనిపించింది.
మరి ఈ వ్యవహారం ఇంతటితో ముగిసిందా? లేక జనసేన వర్గాల్లో ఇంకా అసంతృప్తి మిగిలే ఉందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ప్రస్తుతం బాలయ్య వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
This post was last modified on October 12, 2025 9:24 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…