ప్రపంచ శాంతి దూతగా.. తనను తాను ప్రొజెక్టు చేసుకునేందుకు ప్రయత్నించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నిద్రలేని రాత్రి వచ్చింది. గత రెండు, మూడు మాసాలుగాఆయన నోబెల్ శాంతి బహుమతిపై ఆశలు పెట్టుకున్నారు. ప్రపంచంలో ఈ బహుమతికి ఉన్న ప్రాధాన్యం తెలిసిందే. `ప్రపంచ శాంతి దూత`గా ఆవిర్భవించేందుకు.. నోబెల్ పురస్కారం అంత్యంత కీలకం. దీనిని తాను కైవసం చేసుకునేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలు.. బెదిరింపులు కూడా అందరికీ తెలిసిందే. ఈ ఏడాది శాంతి బహుమతిని తన ఖాతాలో వేసుకునేందుకు చివరి నిముషం వరకు ప్రయత్నించారు. కానీ, ఈ దఫా శాంతి పురస్కారాన్ని వెనుజువెలా దేశానికి చెందిన వ్యక్తికి అందించనున్నారు.
వెనుజువెలా రాజకీయ నాయకురాలు మరియా కొరీనాను నోబెల్ శాంతి పురస్కారానికి తాజాగా ఎంపిక చేశారు. వాస్తవానికి కొరీనా.. వెనుజువెలా విపక్ష నాయకురాలు. అయితే.. జాతుల మధ్య వైరానికి, పేదలకు ఆపన్నహస్తం అందించేందుకు, ముఖ్యంగా అనాథల సేవకు ఎంతో ప్రయత్నించారు. మరీ ముఖ్యంగా ప్రజలకు హక్కులు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ఆమె అలుపెరుగని కృషి చేశారు. దీంతో నోబెల్ శాంతి బహుమతి పురస్కార బృందం.. దీనిపై అనేక రూపాల్లో అధ్యయనం చేసి.. అన్ని వైపుల నుంచి అభిప్రాయాలు సేకరించి.. చివరకు కొరీనాను ఎంపిక చేసింది.
ట్రంప్‌కు భారీ దెబ్బ!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. శాంతి పురస్కారంపై చాలానే ఆశలు పెట్టుకున్నారు. గత మూడు నాలుగు నెలలుగా ఆయన నోబెల్‌పై కన్నేశారు. ఈ క్రమంలోనే ప్రపంచంలో 7 ప్రధాన యుద్ధాలను నిలువరించినట్టు చెప్పుకొచ్చారు. వీటిలో భారత్-పాక్ దేశాల మధ్య జరిగిన ఆపరేషన్ సిందూర్‌కూడా ఉందని ఆయన పదే పదే చెప్పారు. ఇక, ఉక్రెయిన్-రష్యా, ఇజ్రాయెల్-గాజా యుద్ధాలు కూడా ఉన్నాయి. వాటిని తాను సమర్థవంతంగా నిలుపుదల చేసి.. ప్రపంచానికిఎంతో మేలు చేశానని.. ఈ దఫా తనకే శాంతి పురస్కారం దక్కుతుందని ట్రంప్ ప్రచారం చేసుకున్నారు. కానీ, ఆయనకు కాకుండా.. వెనుజువెలా విపక్ష నాయకురాలికి దక్కడం గమనార్హం.
ట్రంప్‌కు ఎందుకు ఇవ్వలేదు?
1) వాస్తవానికి నోబెల్ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవాలంటే.. ఏటా జనవరి 31వ తేదీ ఆఖరు. ఆలోగానే ఈ పురస్కారాలకు దరఖాస్తులు సమర్పించాలి. కానీ, ట్రంప్ ఆ తర్వాత.. శాంతి పురస్కారం కోసం దరఖాస్తు చేసుకున్నారని నోబెల్ కమిటీ తెలిపింది.
2) దేశాల మధ్య శాంతిని ప్రతిపాదించే చర్యలు సమర్థనీయమే అయినా.. అవి బెదిరింపులు, హెచ్చరికలుగా కాకుండా.. చర్చలు, సుస్థిరమైన ప్రదిపాలనతో చేయాలి. ఈ విషయంలో ట్రంప్ బెదిరింపులకు దిగి.. ఆపారన్నది నోబెల్‌కమిటీ చెప్పిన మాట.
3) ట్రంప్‌పలు దేశాల మధ్య యుద్ధాలను నిలువరించినా.. అవి, శాశ్వతమా.. కాదా.. అనేది మరో 6 మాసాల తర్వాత కానీ తెలియదని.. కమిటీ అభిప్రాయపడింది. బెదిరింపులు, హెచ్చరికలతో యుద్ధాలను నిలుపుదల చేయడం అనేది ప్రపంచసుస్థిర శాంతికి దోహదపడదని పేర్కొంది. అందుకే.. ట్రంప్‌నకు ఇవ్వలేదని పేర్కొంది.
This post was last modified on October 10, 2025 7:42 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…