Political News

సునీతకు కలిసివస్తున్న సెంటిమెంట్ పాలిటిక్స్!

తెలంగాణలో కీలకమైన జూబ్లీహిల్స్ (నగరానికి నడిబొడ్డున ఉన్న నియోజకవర్గం) నియోజకవర్గంలో ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ నెల 13 నుండి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. సాధారణంగా జూబ్లీహిల్స్ నుంచి ప్రధాన పార్టీలతో పాటు చిన్న చిత్కా పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా భారీగా పోటీకి దిగుతుంటారు. గతంలోనూ ఇదే పరిస్థితి ఉన్నది. అయితే, ప్రస్తుతం ట్రెండ్‌ను చూస్తే, కేవలం 22 నెలల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెరమీదకు వచ్చిందన్నది గమనార్హం.

గత ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ నాయకుడు, ప్రముఖ వ్యాపారవేత్త మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో అకస్మాత్తుగా మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి మాగంటి సునీతకు బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా టికెట్ ప్రకటించింది. ఆమెకు పార్టీ, సామాజిక వర్గం సహా అన్ని వర్గాల నుండి మద్దతు లభించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి స్థానికంగా అనేక సర్వేలు నిర్వహించబడ్డాయి. ప్రతి సర్వేలో సానుభూతి స్పష్టంగా కనిపిస్తోంది, ముఖ్యంగా మహిళలు మాగంటి కుటుంబం వెనుక ఉన్నారని తెలుస్తోంది.

కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యం ఉన్న ఈ నియోజకవర్గంలో సెటిలర్లు, మిక్స్‌డ్ పీపుల్ ట్రెండ్ కనిపిస్తోంది. బీసీలు ఎక్కువగా ఉన్నప్పటికీ, కేసీఆర్ సెంటిమెంట్ బాగా కనిపిస్తోంది. అందుకే గత రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇక్కడ పాగా వేసింది, మాగంటి ఫ్యామిలీని ప్రజలు భుజాలకెత్తుకున్నారు. 2014లో టీడీపీ తరఫున గెలిచిన మాగంటి తర్వాత కేసీఆర్ పంచన్ చేశారు. ఇప్పుడు కూడా అదే కుటుంబం నుంచి మాగంటి సునీత బరిలో ఉన్న నేపధ్యంలో ఆమెకు పలు రూపాల్లో పరిస్థితులు కలిసివస్తున్నాయి.

ఫ్యాక్టర్లు:

బలమైన కమ్మ వర్గానికి చెందిన నాయకురాలు: ఈ వర్గం ఓట్లు సుమారు 30% అని అంచనా.

ప్రజలకు చేరువైన కుటుంబం: సామాన్య అభివృద్ధి, పేదలకు ఇళ్ల నిర్మాణం, ఏ సమస్య వచ్చినా ఆదుకునే పరిస్థితి ఉంది.

మహిళా సెంటిమెంట్: రాష్ట్ర విభజన తర్వాత, ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ నుండి మహిళా అభ్యర్థులు పోటీ చేయలేకపోయారు. కీలక పార్టీల తరఫున కూడా అడ్డంగా నిల్వలేదు. మాగంటి సునీత మొదటిసారిగా రంగంలోకి దిగుతున్నారు.

సానుభూతి వెల్లువ: భర్త గోపీనాథ్ మరణంతో ఆమెకు సానుభూతి వెల్లువ కలిసివస్తుందనే చర్చ కొనసాగుతోంది.

ప్రతిష్టాత్మకం: ఈ ఉప పోరును బీఆర్ఎస్ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాబట్టి పక్కా ప్రణాళికతో ప్రచార కార్యక్రమాలు ప్రారంభించనున్నారు.

మొత్తం మీద, పలు అంశాలు మాగంటి సునీతకు అనుకూలంగా ప‌ని చేస్తున్నాయనడంలో సందేహం లేదు.

This post was last modified on October 9, 2025 12:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…

10 minutes ago

క్రింజ్ కామెంట్ల‌పై రావిపూడి ఏమ‌న్నాడంటే?

అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అంద‌రూ హిట్ మెషీన్ అంటారు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత అప‌జ‌యం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…

13 minutes ago

100 కోట్లు ఉన్నా ప్రశాంతత లేదా? ఎన్నారై స్టోరీ వైరల్!

అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…

34 minutes ago

ట్రెండుకు భిన్నంగా వెళితే ఎలా జగన్?

బ‌లంగా మాట్లాడాలి. మాట‌కు మాట కౌంట‌ర్ ఇవ్వాలి. అది వింటే ప్ర‌త్య‌ర్థులు నోరు అప్ప‌గించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…

3 hours ago

మహిళా డాక్టర్ హిజాబ్ ను తొలగించిన సీఎం

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…

5 hours ago