ఇన్ని సార్లు బెంగళూరు వెళ్తే జనం మాత్రం ఎవరొస్తారు?

తెలుగు రాజకీయాల్లో అత్యధిక ప్రజాదరణ కలిగిన నాయకులలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు ముందు వరుసలో ఉంటుంది. జగన్ వస్తున్నారంటే చాలు, ఆయనను చూడటానికి జనం తారసపడటం సాధారణం. కానీ ఈ మధ్యకాలంలో ఆ దృశ్యం కనిపించడం లేదు.

ఇటీవల బెంగళూరు నుంచి విజయవాడకు వచ్చిన జగన్‌కు స్వాగతం పలికేందుకు పెద్దగా జనసంద్రం కనిపించలేదు. పార్టీ నేతలు, ముఖ్యంగా దేవినేని అవినాష్ మరియు ఎమ్మెల్సీ తలశిల రఘురాం మాత్రమే కనిపించగా, జగన్ చుట్టూ జనాలు కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. అయినప్పటికీ జగన్ తన చేతులు జోడించి నమస్కారం చేస్తూ నడుస్తూ వెళ్లిపోయారు.

గతంలో జగన్ బెంగళూరు వెళ్తున్నప్పుడు లేదా అక్కడి నుంచి వస్తున్నప్పుడు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ ఉత్సాహం కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

మరింత ఆసక్తికరంగా, వైసీపీ సోషల్ మీడియా ఈ వీడియోలోని అసలు దృశ్యాలను తొలగించి, పాత జనసందోహ దృశ్యాలను జతచేసినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇది కూడా ప్రజలు గమనించక మానలేదు.

ఐదేళ్ల పాలనలో ప్రజల నుంచి దూరమవడం, ఇప్పుడు కూటమి ప్రభుత్వ ప్రాభావం వల్ల జగన్ గ్రాప్ క్రమంగా పడిపోతున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న జగన్, ప్రజల మద్దతు తిరిగి పొందేందుకు ఎప్పుడు చర్యలు తీసుకుంటారో చూడాలి.