సోనమ్ వాంగ్ చుక్!. ఇప్పుడు జాతీయ స్థాయిలో జోరుగా వినిపిస్తున్న పేరు. అంతేకాదు.. సోమవారం సుప్రీంకోర్టు ఈయన వ్యవహారంపై దాదాపు గంట సేపు విచారించింది. అంతేనా.. “ఇతర కేసులు పక్కన పెట్టి మరీ ఈ కేసును విచారించేస్థాయికి తీసుకువచ్చారు. దీనికి గాను.. మేం సమయం కేటాయిస్తాం. వచ్చే మంగళవారం దీనిపై పూర్తిస్తాయి విచారణ చేపడతాం.“ అంటూ.. సుప్రీంకోర్టు పేర్కొందంటే.. ఈ కేసు ప్రాధాన్యం ఎలా ఉందో అర్థమవుతుంది.
ఇక్కడితో కూడా.. ఆగని సుప్రీంకోర్టు.. “సోనమ్‌ను అరెస్టు చేసే ముందు.. నోటీసులు ఇచ్చారా? ఆయన సతీమణికి విషయం తెలిపారా? ఆ బాధ్యత ఎవరిది? కేంద్రానికి లేదా? కేంద్ర ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకెలా వ్యవహరిస్తాయి. దీనిపై వివరణ ఇవ్వండి.“ అని కోర్టు ఆదేశించింది. దీంతో ఈ వ్యవహారానికి జాతీయస్థాయిలో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాల తర్వాతే.. సోనమ్ ఎవరు? ఎందుకు అరెస్టు చేశారు? అనే విషయాలపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది.
ఎవరీ సోనమ్?
జమ్ము కశ్మీర్ కు ప్రత్యేక అధికారాలను బదలాయించే ఆర్టికల్ 370ని రద్దు చేసి.. లద్ధాక్‌ను ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఇక్కడి ప్రజల తరఫున, వారి హక్కుల తరఫున సోనమ్ వాంగ్‌చుక్(ఈయన కశ్మీరీ పండిట్) ఉద్యమిస్తున్నారు. ప్రజల సమస్యలను తెరమీదికి తెస్తున్నారు. అంతేకాదు.. సర్కారును ప్రశ్నించిన వందల మంది యువతపై `పాక్` ముద్ర వేసి.. బలగాలు.. తీవ్ర చిత్రహింసలకు గురి చేస్తున్నాయన్నది ఆయన వాదన.
ఈ క్రమంలోనే తన ఉద్యమాన్ని ఢిల్లీ స్థాయి వరకు విస్తరిస్తానంటూ.. పెద్ద ఎత్తున ఓ ప్రకటన చేశారు. దీంతో గత నెల 26న పోలీసులు అరెస్టు చేశారు. రాత్రికిరాత్రి చెప్పాపెట్టకుండా.. ఆయనపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు. అంతేకాదు.. ఆయన పాకిస్థాన్‌కు సానుభూతిపరుడని కూడా పేర్కొన్నారు. అనంతరం.. సుదూరంగా ఉన్న రాజస్థాన్‌లోని సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ వ్యవహారం భార్యకు తెలియకపోవడంతో.. ఆమె తొలుత స్థానిక పోలీసులను ఆశ్రయించారు.
తర్వాత.. విషయం మీడియా ద్వారా తెలుసుకుని రాష్ట్రపతి, గవర్నర్, ప్రధానికి కూడా వివరించారు. తన భర్త సామాజిక ఉద్యమకారుడే తప్ప.. పాకిస్థాన్ అనుకూల వాది కాదని ఆధారాలు సమర్పించారు. అయినా.. వారు స్పందించకపోవడంతో నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. కోర్టు.. తీవ్రస్థాయిలో మండి పడింది. జాతీయ భద్రతకు సోనమ్ వల్ల వచ్చిన.. అఘాయిత్యం ఏంటని ప్రశ్నించింది. పహల్గాం దాడుల్లో ఆయన పాత్ర ఉందన్న న్యాయవాది.. వ్యాఖ్యలను నిర్ద్వంద్వంగా కొట్టివేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates